న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. గురువారం నుంచి దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి రాండమ్‌గా నమూనాలను సేకరించి వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపే ఏర్పాట్లు చేసింది. బెంగళూరు సహా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభమయ్యాయి.
ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కేంద్రం సూచిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌తో భయాపడాల్సిన పనిలేదని, కరోనా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రతివారం కరోనా సమీక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితిని నిశితంగా గమనిస్తామని పేర్కొంది.
185 కొత్త కేసులు..
కొత్త వేరియంట్ వెలుగుచూసినప్పటికి దేశంలో గురువారం 185 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,402 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4.47కోట్ల మంది వైరస్ బారినపడగా.. 5.31 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
చదవండి: కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు
Comments
Please login to add a commentAdd a comment