న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 12,193 మంది కోవిడ్ బారినపడ్డారు. మరో 42 మంది వైరస్‌కు బలయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 67,556గా ఉంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,48,81,877కు చేరగా.. మృతుల సంఖ్య 5,31,300కు పెరిగింది.
కాగా.. వైరస్ సోకిన వారిలో 4,42,83,021 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కొనసాగించాలన్నారు. బూస్టర్ డోసు తీసుకోనివారు ఉంటే వీలైనంత త్వరగా తీసుకోవాలని చెబుతున్నారు.
చదవండి: అత్యంత ‘వేడి’ సంవత్సరం ఏదంటే..! ఆ నివేదిక ఏం చెబుతోంది?
Comments
Please login to add a commentAdd a comment