న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 11,109 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేల మార్క్‌కు చేరువై 49,622గా ఉంది. కరోనా కారణంగా మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు మొత్తం 4,42,16,853 మంది కోలుకున్నారు. మొత్తం 5,31,064 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే రోజువారి పాజిటివిటీ రేటు 5.01శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.22శాతంగా ఉంది.
కాగా.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా యాంటీ ఇన్‌ఫెక్టివ్, రెస్పిరేటరీ డ్రగ్స్ విక్రయాలు దాదాపు 50 శాతం పెరిగినట్లు ఓ నివేదిక తెలిపింది. జ్వరం, దగ్గు, ఇతర లక్షణాలతో బాధపడుతున్న వారు మెడికల్ షాపులకు వెళ్లి ఈ మందులు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది.
మరోవైపు ఢిల్లీలో కరోనా కేసుల్లో వృద్ధి నమోదవుతున్న కారణంగా ఉత్తర్‌ప్రదేశ్ నోయిడా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. స్కూళ్లు, కాలేజీలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. అలాగే కార్యాలయాల్లో శానిటైజేషన్ చేసి పరిశుభ్రత పాటించాలని, కరోనా లక్షణాలు కన్పించిన ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం ఆప్షన్ ఇవ్వాలని తెలిపింది.
చదవండి: స్కూళ్లు, కాలేజీల్లో మాస్కులు తప్పనిసరి.. దగ్గు, జ్వరం లక్షణాలుంటే ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం..!
Comments
Please login to add a commentAdd a comment