దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,435 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 15 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 23,091కు చేరుకుంది. గత అయిదు నెలల్లో(163 రోజులు) ఇంత భారీస్థాయిలో కేసులు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.పేర్కొంది. తాజా కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్లకు చేరుకున్నాయి.
ఇప్పటి వరకు 4,41,79,712 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో రికవరి రేటు 98.76కాగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో నాలుగు మరణాలు సంభవించగా, చత్తీస్‌గఢ్‌్, ఢిల్లీ, గుజరాత్ , హర్యానా, కర్ణాటక, పుదుచ్చేరి, రాజస్తాన్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున మరణాలు నమోదయ్యాయి.
(చదవండి: ఆ విషయాల్లో మోదీని విడిచిపెట్టలేదు! ఐనా రివేంజ్ తీర్చుకోలేదు! గులాం నబీ అజాద్)
Comments
Please login to add a commentAdd a comment