దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసుల నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,48,27,226కి చేరింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేల మార్క్‌కు దాటింది. ప్రస్తుతం 60,313 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో మొత్తం 6,313 రికవరీలు జరగగా మొత్తం రికవరీల సంఖ్య 4,42,35,772కి చేరుకుంది. గత కొద్ది రోజలుగా పెరుతున్న కరోనా కేసుల సంఖ్యతో పోలిస్తే తాజగా నమోదైన కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
అదీగాక గత 24 గంటల వ్యవధిలో గుజరాత్‌లో ఆరుగురు, ఉత్తర్ ప్రదేశ్, కేరళలో నలుగురు చొప్పున, ఢిల్లీ, రాజస్థాన్‌లో ముగ్గురు చొప్పున, మహారాష్ట్రలో ఇద్దరు, బీహార్, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ మృతుల సంఖ్య 5,31,141కి ఎగబాకింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.13శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,26,522) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్‌బీ1.16 వల్లే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, దేశంలో పదిరోజుల వరకు ఇలానే కొనసాగుతుందని తదనంతరం తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: ఆగని కరోనా ఉధృతి.. కొత్తగా 11,109 మందికి పాజిటివ్.. 50 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment