సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత వారంలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని కేంద్రప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలో గత వారంలో 132 కరోనా కేసులు నమోదు కాగా, మార్చి 15తో ముగిసిన వారంలో ఆ సంఖ్య 267కి పెరిగిందని వెల్లడించింది. దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో హైదరాబాద్ కూడా ఉన్నట్లు పేర్కొంది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణకు సూచించింది. కోవిడ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఇన్‌ఫ్లుఎంజా వంటి అనారోగ్యం కూడా ఉన్నట్లు తెలిపింది. కాగా, తెలంగాణలో గురు వారం 27 కరోనా కేసులు నమోద య్యాయి. అంతకుముందు రోజు బుధ వారం ఏకంగా 54 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించింది.
Comments
Please login to add a commentAdd a comment