సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్–19 కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన 1,245 కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా తొమ్మిది కోవిడ్ –19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇందులో 68 నమూనాలకు సంబంధించి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ప్రస్తుతం 27 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఏకంగా 8 హైదరాబాద్ జిల్లాకు చెందినవి కాగా...ఒకటి రంగారెడ్డి జిల్లాలో నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment