
మార్చి14 వరకు అంబేద్కర్ వర్సిటీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు
బంజారాహిల్స్(హైదరాబాద్): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అర్హత పరీక్ష -2015కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును మార్చి 14వ తేదీ వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎ.సుధాకర్ శనివారం తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతుందని ఆయన వెల్లడించారు.