గంటలు కాదు.. రోజులు దాటాయ్..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే ఎదురుచూపులే...
ఆన్‌లైన్ నమోదులో జాప్యం.. చెల్లింపుల్లో ఆలస్యం
ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు
‘పెద్ది’ ప్రకటనతో అన్నదాతల్లో ఆశలు
నర్సంపేట : రైతులు కష్టించి పండించిన ధాన్యాన్ని విక్రరుుంచడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేం దుకు దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్రమేణా పర్యవేక్షణ లోపంతో రైతులకు మళ్లీ ఇబ్బందులు ఎదురవుతున్నారుు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం ధాన్యం విక్రరుుంచిన తర్వాత ఆన్‌లైన్‌లో నమోదైన సమయం నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ కావాలి. కానీ ఇది అమలుకు నోచుకోవడం లేదు.
ఊరటగా చైర్మన్ ప్రకటన సివిల్ సప్లయి రాష్ట్ర చైర్మన్‌గా రూరల్ జిల్లాకు చెందిన పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వరుస సమీక్షలతో పౌర సరఫరాల శాఖలోని లోపాలను సరిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో రైతులకు ధాన్యం డబ్బు ఎప్పటికప్పుడు చెల్లించే విషయం కూడా గాడిన పడేలా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇలా పెద్ది ఆదేశాలు ఫలించి తమకు మేలు జరుగుతుందని రైతులు భావిస్తున్నారు. శుక్రవారం కూడా నర్సంపేటలో జరిగిన శాఖ సమీక్షలో రైతులు విక్రరుుంచిన ధాన్యానికి 48 గంటల్లో అకౌంట్ల జమ చేయాల్సిందేనని.. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి రైతులకు ఇబ్బందులు కలిగజేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
చెల్లింపులో జాప్యం....
వరంగల్ రూరల్ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 30,913 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగైంది. దిగుబడిని రైతులు విక్రరుుంచిన 48 గంటల్లోపు చెల్లింపులు చేస్తామని గత పంట కాలం నుంచి చెబుతున్నా అమలు కావడంలేదు. ఈ నెల మొదటి వారంలో ధాన్యం సేకరణ ప్రారంభం కాగా రెండు రోజుల కిందట చెల్లింపులు మొదలయ్యారుు. ఆన్‌లైన్‌లో నగదు జమ చేయడానికి వారం పదిహేను రోజులకుపైగా సమయం తీసుకుంటోంది. సివిల్ సప్లై కేంద్రాలకు గన్నీ సంచులను పంపిన వెంటనే వివరాలను నమోదు చేయాలి. తద్వారా కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాల అప్‌లోడ్‌కు వీలవుతుంది. కానీ పౌరసరఫరాల సంస్థ గన్నీలను పంపినా వీటి వివరాలను సకాలంలో ఆన్‌లైన్ చేయటం లేదు. దీంతో కేంద్రాల్లో ధాన్యం విక్రరుుంచిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం సిబ్బందికి సాధ్యపడటం లేదు. ఈ మేరకు రైతులు విక్రరుుంచిన బస్తాలు తరలించిన వారం వరకు ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ కాకపోవడం చెల్లింపుల్లో ఆలస్యానికి కారణమవుతోంది. ప్రస్తుతం ధాన్యం సేకరణ తొలిదశలోనే ఇలా ఉంటే మరో వారం రోజుల్లో సేకరణ మరింత పెరిగే అవకాశం ఉండగా రైతులకు డబ్బు చెల్లింపుల్లో కూడా జాప్యం జరుగుతుంది. దీనిని అధికారులు ఇప్పటికై నా మేల్కొంటే రైతులకు మేలు చేసిన వారవుతారు.
అమలు జరుగుతుంది ఇలా......
దుగ్గొండి మండలంలోని బల్వంతాపురంలో గత నెల 28న ధనలక్ష్మి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 26 రోజులుగా ఈ కేంద్రం పనిచేస్తుండగా ఇప్పటికి 750 బస్తాల(40 కిలోల చొప్పున) ధాన్యం కొనుగోలు చేశారు. 200 క్వింటాళ్ల ధాన్యం గిర్నిబావి సమీపంలోని వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్‌కు ఎగుమతి చేయగా మరో 100 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉంది. 14 మంది రైతులకు అమ్మకం చీటీలు ఇచ్చారు. సరుకు తూకం పూర్తి కాగానే వివరాలన్నీ నిర్వాహకులు ట్యాబ్‌ల ద్వారా ఆన్‌లైన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బు జమకావాలి. కానీ అలా కాకుండా వారం రోజులకు జమ అవుతోందని రైతులు చెబుతున్నారు. ఇక్కడ ఇప్పటికీ 14 మంది రైతులు ఏ గ్రేడ్ ధాన్యాన్ని విక్రరుుంచగా నలుగురు రైతులు ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ అయ్యారుు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పెంతల ఇంద్రారెడ్డి. నల్లబెల్లి శివారు కొండారుులుపల్లికి చెందిన ఈయన కూతురు మహేశ్వరి వివాహం శుక్రవారం జరిగింది. పెళ్లి ఖర్చుల కోసం తాను పండించిన 68 బస్తాల ధాన్యాన్ని ఇరవై రోజుల క్రితం కొనుగోలు కేంద్రంలో విక్రరుుంచారు. అరుుతే, పెళ్లి రోజు వచ్చినా ధాన్యం డబ్బులు రాకపోవడంతో ఇబ్బంది పడ్డాడు. అక్కడా, ఇక్కడా అప్పులు తెచ్చి ఎలాగోలా పెళ్లి కానిచ్చేశాడు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో ధాన్యం అమ్మిన వారికి ఆన్‌లైన్ అరుున 48 గంటల్లో డబ్బును ఖాతాల్లో జమ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన అమలుకావడం లేదనడానికి ఇంద్రారెడ్డి ప్రత్యక్ష ఉదాహరణ...