కేంద్ర ఉద్యోగాల భర్తీ కట్టుదిట్టం | Commit to replace the jobs | Sakshi
Sakshi News home page

కేంద్ర ఉద్యోగాల భర్తీ కట్టుదిట్టం

Published Mon, Dec 29 2014 1:33 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

వివిధ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చే యాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విధివిధానాల్లో మార్పులు
  • కేంద్రానికి నిపుణుల బృందం సిఫారసులు
  • సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చే యాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్సెస్సీ) అనుసరిస్తున్న పరీక్షల విధానంలో మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఇదివరకు నియమించిన ఎంజీ ఖాన్ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు) నేతృత్వంలోని నిపుణుల బృందం ఇటీవలే పలు సిఫారసులతో కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదికను అందజేసింది.

    ప్రస్తుత ఎస్సెస్సీ రిక్రూట్‌మెంటు విధానాన్ని సమీక్షించిన ఈ కమిటీ మూడు అంశాలపై ప్రత్యేక బృందాలతో అధ్యయనం చేయించింది. జాతీయ స్క్రీనింగ్ టెస్టు, సాంకేతిక అంశాలపై ఒక గ్రూపు, అవగాహన కార్యక్రమాలపై మరో బృందం, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సు (సీఏపీఎఫ్) నియామకాలపై ఇంకో టీం కమిటీకి వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి. వీటిని క్రోడీకరించి కమిటీ తుది నివేదికను సమర్పించింది. కమిటీ సిఫార సులను డీఓపీటీ (సిబ్బంది, శిక్షణ శాఖ) తన వెబ్ సైట్‌లో పొందుపర్చింది. వీటిపై పది రోజుల్లోగా అభిప్రాయాలను తెలియచేయాలని డీఓపీటీ డెరైక్టర్ జి.జయంతి పేర్కొన్నారు. అభిప్రాయాలను jayanthig@nic.in ఈ-మెయిల్‌కు లేదా డెరైక్టర్, ఎస్టాబ్లిష్‌మెంటు-2, డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రయినింగ్, రూమ్‌నంబర్ 278సీ, నార్త్ బ్లాక్, న్యూ ఢిల్లీ’ చిరునామాకు లిఖితపూర్వకంగా పంపవచ్చు.
     
    కమిటీ సిఫార్సులు ఇవీ...
    ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి. ఈశాన్య రాష్ట్రాలలో ఐటీ వనరులు లేనందున వాటికి ఏడాది మినహాయింపునివ్వాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఒక్కసారే చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, ఆధార్ సంఖ్య వంటివి యథాతథంగా కొనసాగిస్తూ విద్యార్హతలను మాత్రం అప్‌డేట్ చేసుకోవాలి.  
         
    ఆన్‌లైన్ పరీక్షా విధానాన్ని అనుసరించాలి. ఇందుకు ఎస్సెస్సీ అదనపు వనరులు సమకూర్చుకోవాలి. ప్రయివేటు విద్యా  సంస్థల సహకారమూ తీసుకోవాలి. క్వశ్చన్ బ్యాంక్‌కు డిజిటైజ్డ్ ఫార్మేట్‌ను అనుసరించడంతో పాటు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ప్రశ్నలు, జవాబులను జంబ్లింగ్ విధానంలో ఇవ్వాలి. నెగిటివ్ మార్కులు తప్పనిసరి చేయాలి. ప్రశ్నపత్రాలతో పాటు జవాబుకీని అప్‌లోడ్ చేయాలి.
         
    బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించాలి. సీసీటీవీలతో రికార్డు చేయడంతో పాటు మొబైల్ జామర్లను వినియోగించాలి.
         
    ఎస్సెస్సీ పరీక్షల షెడ్యూల్‌ను ఏటా ముందుగానే విడుదల చేయాలి. పరీక్షలపై విస్తృత ప్రచారం చేయాలి. స్థానిక దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. హోర్డింగులు, కరపత్రాలు, పోస్టర్లు, ఫేస్‌బుక్, ట్వీటర్లనూ వినియోగించాలి.  
         
    కాలేజీలు, వర్సిటీల్లో కెరీర్ కౌన్సెలింగ్‌లను, సదస్సులను నిర్వహించాలి.
         
    సీఏపీఎఫ్ నియామకాల్లో 10 ప్లస్ 2 లోపు విద్యార్హతలున్న పోస్టుల రిక్రూట్‌మెంటును ఎస్సెస్సీ చేపట్టకూడదు. కానిస్టేబుల్ తదితర రిక్రూట్‌మెంటును హోం శాఖ అనుమతితో సీఏపీఎఫ్ చేపట్టాలి. లేదా 60 శాతం పోస్టులను ఎస్సెస్సీ ఆన్‌లైన్ పరీక్షల ద్వారా భర్తీ చేయాలి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement