ఆరు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు | Government offices in six regions | Sakshi
Sakshi News home page

ఆరు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు

Aug 25 2016 12:37 AM | Updated on Oct 8 2018 5:19 PM

మహబూబాబాద్‌ జిల్లాగా ఏర్పాటుకానుండడంతో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు పలు ప్రాం తాల్లో పక్కా భవనాల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అయితే, నిధులు మంజూరై, నిర్మాణాలు పూర్తయ్యే వరకు సమ యం పట్టే అవకాశముండడంతో తాత్కాలిక భవనాలు అన్వేషిస్తున్నారు.

  • మానుకోటలో భవన నిర్మాణాల కోసం స్థల పరిశీలన
  • కార్యాలయాల కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టి
  • మహబూబాబాద్‌ : మహబూబాబాద్‌ జిల్లాగా ఏర్పాటుకానుండడంతో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు పలు ప్రాం తాల్లో పక్కా భవనాల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అయితే, నిధులు మంజూరై, నిర్మాణాలు పూర్తయ్యే వరకు సమ యం పట్టే అవకాశముండడంతో తాత్కాలిక భవనాలు అన్వేషిస్తున్నారు.
    కురవి రోడ్డుపైనే దృష్టి
    అధికారులు ప్రభుత్వ కార్యాలయాల కోసం భూములు అన్వేషించినా ఆ వివరాలు వెల్లడించడం లేదు. అలా చేస్తే భూముల ధరలను రియల్టర్లు అమాంతం పెంచేస్తారన్న కారణంతో వారు గోప్యంగా ఉంచుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కురవి రోడ్డులోని 255 సర్వే నెంబర్‌ భూముల్లో సుమారు 25 నుంచి 30 ఎకరాల భూమిని గుర్తించి నివేదిక పంపినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇల్లందు రోడ్డు, అనంతారం రోడ్డు, శని గపురం రోడ్డులోని పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.
     
    శనిగపురం రోడ్డులోని ఐటీఐ కళాశాల ప్రక్కనే ఉ న్న ప్రభుత్వ భూమిని సర్వే చేయిం చారు. 255, 504, 555, 287, 163 సర్వే నెంబర్లలో ప్రభుత్వ కార్యాల యాల భవనాల కోసం భూములకు సంబంధించిన వివరాలతో నివేదిక రూపొందించారు. కాగా, కురవి రో డ్డు ప్రక్కనే ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండటం, జాతీయ రహదారి కావడంతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అటువైపే అధికారులు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ముందుగా గుర్తించిన భూముల చుట్టూ వారంలో ఫెన్సింగ్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇంకా పలు కార్యాలయాల ఆవరణల్లో ఖా ళీ స్థలాలు ఉన్నట్లు నివేదికలో పొందుపర్చారు.
    కార్యాలయాలు ఇక్కడే..
    దసరా నుంచే కొత్త జిల్లాలు అమలులోకి రావాలన్న ప్రభుత్వ నిర్ణయంతో కార్యాలయాలకు తాత్కాలికంగా ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. పట్టణ శివారులోని ఇందిరానగర్‌ సమీపంలోని వైటీసీ భవనాన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి కేటాయించారు. పట్టణ శివారులోని ఐటీఐ భవనాన్ని జిల్లా పోలీస్‌ కార్యాలయంగా, సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఏడీ సర్వేలాండ్‌ రికార్డ్స్‌తో పాటు జిల్లా కోశాధికారి కార్యాలయానికి కేటాయించి నట్లు చెబుతున్నారు. అనంతారం వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని డీఆర్‌డీఏ, ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయాల కోసం కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు.
     
    మండల పరిషత్‌ కార్యాలయంను జి ల్లా పరిషత్‌ కార్యాలయంగా, ఈఈ పీఆర్‌ కార్యాలయా న్ని పంచాయితీరాజ్‌ శాఖ ఎస్‌ఈ కార్యాలయంగా, ఈఈ ఆర్‌అండ్‌బీ కార్యాలయాన్ని రోడ్డు భవనాల శాఖ ఎస్‌ఈ కార్యాలయంగా, ఈఈ నీటి పారుదల శాఖ  కార్యాలయంను నీటి పారుదల శాఖ కార్యాలయంగా, ఎంఈఓ కార్యాలయంను డీఈఓ, ఏపీడీ డ్వామా కార్యాలయాన్ని జిల్లా నీటి యాజమాన్య సంస్థగా, డివిజనల్‌ సమాచార కార్యాలయం జిల్లా సహకార కార్యాలయం గా, సబ్‌ డీఎఫ్‌ఓ కార్యాలయాన్ని జిల్లా అటవీశాఖ కార్యాలయంగా, ఏటీడబ్ల్యూఓ కార్యాలయాన్ని డీటీడబ్ల్యూఓ కార్యాలయంగా, అగ్నిమాపక కేంద్రంను జిల్లా అగ్నిమాపక కేంద్రంగా, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనంలో జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement