సాక్షి, మంచిర్యాల : జిల్లాలో ఈనెల మూడు నుంచి ఐదో తేదీ వరకు నిర్వహించనున్న ఇన్‌స్పైర్ మేళా ఇప్పుడు ఉపాధ్యాయ, ఔత్సాహిక విద్యార్థి వర్గాల్లో చర్చనీయాంశం అయింది. విస్తారంగా ఉన్న జిల్లాను, భౌగోళిక దూరాన్ని దృష్టిలో పెట్టుకొని గతంతో జిల్లా కేంద్రంతోపాటు మంచిర్యాలలో మేళా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా జిల్లా కేంద్రంలో ఒక్కచోటే మేళా కేంద్రాన్ని ఏర్పాటుచే యాలనే నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి.
ఇన్‌స్పైర్ ఇబ్బందులు
విద్యార్థుల్లోని సృజనాత్మకత ఆధారంగా రూపొందిన వాటికి ప్రదర్శన అవకాశం కల్పించేందుకు ఇన్‌స్పైర్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనకు ఎంపికైన ఒక్కొ విద్యార్థికి రూ.5వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనితో సంబంధిత ఆవిష్కరణకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవడం, ప్రదర్శన కేంద్రానికి రవాణా ఖర్చులు, ప్రదర్శన జరిగే సమయంలోని భోజన, వసతి సదుపాయలను సర్దుకోవాలి. అయితే ఆదిలాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్‌లో ఒక్కచోటే ఈ మేళా జరపాలని నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది.
అయితే అధికారిక నిర్ణయం వెలువడకముందు మంచిర్యాల సమీపంలోని సీసీసీలో గల ఓ పాఠశాలలో ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆధారంగా తక్కువ దరఖాస్తులు వస్తున్న దృష్ట్యా జిల్లా కేంద్రంలోనే మేళా ఏర్పాటు చేస్తున్నట్లు సమావేశం ఏర్పాటు చేసి విద్యాశాఖ వర్గాలకు డీఈవో తెలిపారు. జిల్లా భౌగోళిక స్థితిగతులతోపాటు వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తూర్పు జిల్లా నుంచి గతంలో అర్హత సాధించిన 310 మందితో పాటు ప్రస్తుతం అర్హత సాధించిన వారు 208 మంది ఉన్నారు.
ఈ 528 మంది విద్యార్థులతోపాటు ఒక్కో విద్యార్థితోపాటు ఒక టీచర్ ఇన్‌స్పైర్ మేళాకు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులతో మహిళా ఉపాధ్యాయురాలు వె ళ్లే అవకాశాలున్నాయి. వీరందరికీ వసతి సదుపాయాలు ఎలా లభ ్యమవుతాయనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో నెలకొంది. విద్యాశాఖ వర్గాలు ఈ విషయమై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై డీఈవోపాటు డిప్యూటీ డీఈవోను వివరణ కోరే యత్నం చేయగా వారు స్పందించలేదు.
దూరభారం..ఇన్‌స్పైర్ మేళా
Published Sat, Aug 2 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM
Advertisement
Advertisement