అంబేద్కర్ వర్సిటీ ప్రవేశ పరీక్షకు చివరి అవకాశం
హైదరాబాద్ సిటీ (బంజారాహిల్స్): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం ప్రవేశ అర్హత పరీక్ష -2015 దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 28వ తేదీతో ముగుస్తుందని విశ్వవిద్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వారు త్వరితగతిన తమ దరఖాస్తులను అందించాలని కోరారు. ఏప్రిల్ 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.