'డిగ్రీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు వెసులుబాటివ్వాలి'
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరం (2017–18)లో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియ ప్రహసనంగా మారడంతో విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగం ధ్వజమెత్తింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను కేవలం మీ–సేవ, ఈ–సేవ ద్వారానే చేయాలనడం విద్యార్థులకు సమస్యగా మారిందని... కొన్ని కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది.
అలాగే ఈ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ తదితరాలకు రూ. 200 వరకు చెల్లించాల్సి వస్తోందని... ఈ దృష్ట్యా ప్రతి ఇంటర్నెట్ కేంద్రంలో రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు విశ్వనాథ్‌చారి డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు.