కరోనాకు సంబంధించి వాస్తవాలను వెల్లడించలేదని రాష్ట్ర ప్రభుత్వంపై నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఆరోపించారు. ఈయన గత కొద్ది కాలంగా ప్రభుత్వ విధానాలపై స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో మరోసారి లాక్‌డౌన్ విధించడాన్ని కమల్ తప్పు పట్టారు. దీని గురించి ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాకు సంబంధించిన వాస్తవాలను వెల్లడించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు.
ఆది నుంచి కరోనా టెస్టులను అధికారులు ఎక్కువగా నిర్వహించలేకపోయారని.. అదే ఇప్పుడు ఆర్థిక లాక్ డౌన్‌కు కారణమవుతోందని పేర్కొన్నారు. సుమారు మూడు నెలలుగా లాక్ డౌన్ అమల్లో ఉండగా మళ్లీ ఇప్పుడు నాలుగు జిల్లాలకు ప్రత్యేకంగా లాక్ డౌన్ ఎందుకని ప్రశ్నించారు. సకాలంలో చర్యలు తీసుకోలేని ప్రభుత్వంలో మనం ఉన్నామని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిందన్నారు. ఆదిలోనే విదేశాల నుంచి వచ్చిన వారిని విమానాశ్రయంలోనే టెస్ట్‌లు నిర్వహించి ఉంటే ఈ కరోనా ప్రభావం ఇంతగా ఉండేది కాదని పేర్కొన్నారు. (చదవండి: కరోనా చికిత్సకు గ్లెన్‌మార్క్ ఔషధం )
Comments
Please login to add a commentAdd a comment