Tamilanadu Government Serious On Kamal Haasan: మొన్నటిదాకా కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. తాజాగా ఒమిక్రాన్ తన సత్తా చాటేందుకు రెడీగా ఉంది. మళ్లీ కరోనా కేసులు పెరగడం మొదలైంది. పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుంటున్నాయి. అయినా రూల్స్ బ్రేక్ చేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు కొందరు. ఈ విధంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వాలు కఠినంగానే స్పందిస్తున్నాయి. వారు ప్రముఖులైన విడిచిపెట్టట్లేదని తాజా సంఘటనతో తెలుస్తోంది. తాజాగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌పై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది.
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న లోకనాయకుడు బిగ్‌బాస్ (తమిళం) షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో కమల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తమిళనాడు సర్కార్. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వెంటనే బిగ్‌బాస్ షో షూటింగ్‌లో పాల్గొనడం ఏంటీ అని నిలదీసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘింటి షూటింగ్ చేయడం కరెక్ట్ కాదని, దీనివల్ల మిగతా వారికీ ప్రమాదం ఏర్పడుతుందని తెలిపింది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖులే ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస‍్తారా ? అంటూ ప్రశ్నించింది. ఈ చర్యపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ నుంచి తమిళనాడు ప‍్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కమల్ హాసన్ స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచనలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం కోలుకున్నాక డిశ్చార్జ్ అయ్యారు. అలాగే శంకర్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న 'ఇండియన్ 2' చిత్రం కూడా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: కమల్‌హాసన్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏం చెప్పారంటే ?
Comments
Please login to add a commentAdd a comment