రైట్ రైట్
Published Thu, Oct 24 2013 3:53 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM
సాక్షి, చెన్నై:చెన్నైలో పెద్ద బస్సులు వెళ్లలేని మార్గాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మినీబస్సులు నడపనున్నామని ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో గతంలో ప్రకటించారు. ఈ మేరకు తొలి విడతగా 50 బస్సులు సిద్ధమయ్యూయి స్మాల్‌బస్ పేరుతో వీటిని నగరంలోని చిన్నచిన్న ప్రాంతాల్ని కలుపుతూ నడిపేందుకు చర్య లు తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మరో 610 బస్సుల్ని కొనుగోలు చేశారు. వీటిని బుధవారం ఉదయం నెహ్రూ స్టేడియంలో జరిగిన వేడుకలో జయలలిత ప్రారంభించారు. డీఎంకే హయూం నుంచి నేటి వరకు ఉద్యోగ విరమణ పొందిన 61,746 మందికి రూ.257 కోట్లతో పింఛన్ అందజేశారు.
స్మాల్‌బస్ రూట్లు
ఎస్1:పల్లావరం రైల్వేస్టేషన్-తిరుశూలం
శక్తినగర్ మధ్య రెండు, ఎస్2: క్రోంపేట - మేడవాక్కం మధ్య మూడు, ఎస్3: క్రోంపేట-మాడంబాక్కం మధ్య మూడు, ఎస్4: క్రోంపేట-మేడవాక్కం మధ్య మూడు, ఎస్5: పెరుంగళత్తూర్-అరుంగాల్ మధ్య రెండు, ఎస్11: గిండి ఆసార్ కానా - కీల్‌కట్టాలై మధ్య మూడు, ఎస్12 : గిండి ఆసార్ కానా - ఎన్జీవో కాలనీ మధ్య రెండు, ఎస్13: గిండి - వేళచ్చేరి మధ్య రెండు నడవనున్నాయి. అలాగే ఎస్14 : ఎస్‌ఆర్‌పీ టూల్స్-మేట్టుకుప్పం మధ్య మూ డు, ఎస్21:రామాపురం-పోరూర్ మధ్య రెం డు, ఎస్22:పోరూర్-పట్టూర్ మధ్య రెండు, ఎస్23: అయ్యప్పన్‌తాంగల్-కుమరన్ చావడి మధ్య మూడు, ఎస్24: అయ్యప్పన్‌తాంగల్ - తిరువేర్కాడు మధ్య మూడు, ఎస్25: మధురవాయల్ - వలసరవాక్కం మధ్య రెండు,
ఎస్31 : వడపళణి - కోయంబేడు బస్సుస్టాండు మధ్య నాలుగు, ఎస్ 32 వడపళణి - తిరువికా పార్కు మధ్య రెండు, ఎస్ 33: అశోక్ పిల్లర్ - మెహతా నగర్ మధ్య రెండు, ఎస్41: అంబ త్తూర్ ఓటీ - మురుగప్పా పాలిటెక్నిక్ మధ్య రెండు, ఎస్ 61: మాధావరం - రెట్టేరి కూడలి మధ్య మూడు, ఎస్ 62: మూలకడై - మనలి మధ్య మూడు స్మాల్ బస్సుల్ని నడపనున్నారు. ఆయా ప్రాంతాల మధ్య ఉన్న చిన్నచిన్న కాలనీ, నగర్‌లను కలుపుతూ ఈ బస్సులు నడుస్తాయని జయలలిత పేర్కొన్నారు. ఈ బస్సుల్లో డ్రైవర్, కండక్టర్‌తో సహా 27 మంది పయనించేందుకు వీలు ఉంది. కనిష్ట చార్జీగా రూ.ఐదు, గరిష్టంగా రూ.8గా నిర్ణయించారు.
610 బస్సులు
కొత్తగా కొనుగోలు చేసిన 610 బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ విభాగానికి -19, విల్లుపురం డివిజన్‌కు 104 , సేలం డివిజన్‌కు 52, కోయంబత్తూరు డివిజన్‌కు 84, కుంభకోణం డివిజన్‌కు 203, మదురై డివిజన్‌కు 103, తిరునల్వేలి డివిజన్‌కు - 45 బస్సులు కేటాయించారు.
అభివృద్ధి మా ఘనతే
నెహ్రూ స్టేడియంలో జరిగిన బస్సుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జయలలిత ప్రసంగించారు. రవాణా సంస్థను గత డీఎంకే ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసిందని ధ్వజమెత్తారు. వారి హయూంలో తీసుకున్న నిర్ణయాలతో ఈ సంస్థ దివాల దశకు చేరుకుందని ఆరోపించారు. అప్పట్లో పదవీ విరమణ పొందిన కార్మికులకు పెన్షన్ సైతం మంజూరు చేయకపోవడాన్ని బట్టి చూస్తే సంస్థను ఏ మేరకు భ్రష్టు పట్టించారో అర్థం చేసుకోవచ్చని మండి పడ్డారు. తాను అధికార పగ్గాలు చేపట్టాక రవాణా సంస్థ బలోపేతమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నానని వివరించారు. ప్రస్తుతం ఈ సంస్థ అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు అమ్మ మినరల్ వాటర్ బాటిళ్లను రూ.పదికే విక్రయిస్తున్నామని చెప్పారు. ప్రయాణికులకు మరింతగా చేరువయ్యే రీతిలో స్టాల్స్ సంఖ్య పెంచనున్నామని ప్రకటించారు. ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా మరో మినరల్ వాటర్ ప్లాంట్‌ను నెలకొల్పనున్నామని జయలలిత వెల్లడించారు.
Advertisement