చెన్నై: తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో అన్ని కులాలకు చెందిన వ్యక్తులను అర్చకులుగా నియమించింది. మొత్తం 24 మందికి సీఎం స్టాలిన్ శనివారం నియామక ఉత్తర్వులు ఇచ్చారు. అర్చకులుగా నియమితులైన వారు పూర్తి స్థాయి శిక్షణ పొందిన తర్వాతే విధుల్లో చేరారని ప్రభుత్వం వెల్లడించింది. అన్ని కులాల వారికి దేవాలయ అర్చకుల విధుల్లో భాగం కల్పిస్తామని సీఎం స్టాలిన్ ఇచ్చిన ఎన్నిక హామీ దీంతో నెరవేరినట్లయింది.
ఆగస్టు 14కు స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు అయిన నేపథ్యంలో ఈ నియామకాలు జరగడం గమనార్హం. 24 మంది అర్చకులతో పాటు పలు విభాగాలకు సంబంధించి మొత్తం 208 మంది నియామకం జరిగింది. వీరిలో భట్టాచార్యులు (వైష్ణవ పూజారులు), ఒధువార్లు (శైవ సంప్రదాయ నిపుణులు) ఇద్దరూ ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ చర్యతో మాజీ సీఎం కరుణానిధి కల నెరవేరిందని స్టాలిన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని బీజేపీ సహా పలువురు స్వామీజీలు, మఠాధిపతులు స్వాగతించారు.
Comments
Please login to add a commentAdd a comment