
ప్యారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం చేరింది. హై జంప్ టీ64 విభాగంలో ప్రవీణ్ కుమార్ పసిడి పతకం సాధించాడు. టోక్యోలో రజతానికి పరిమితమైన ఈ ఉత్తరప్రదేశ్ పారా అథ్లెట్.. ప్యారిస్‌లో మాత్రం పొరపాట్లకు తావివ్వలేదు. శుక్రవారం నాటి ఈవెంట్లో 21 ఏళ్ల ప్రవీణ్.. అత్యుత్తంగా 2.08 మీటర్ల దూరం దూకి గోల్డ్ మెడల్ ఖాయం చేసుకున్నాడు.
సరికొత్త చరిత్ర
అమెరికాకు చెందిన డెరెక్ లాక్సిడెంట్(2.06మీ.- రెండోస్థానం), ఉజ్బెకిస్తాన్ పారా అథ్లెట్ తెముర్బెక్ గియాజోవ్(2.03 మీ- మూడో స్థానం)లను వెనక్కి నెట్టి.. స్వర్ణం గెలిచాడు. పారా విశ్వక్రీడ వేదికపై త్రివర్ణ పతకాన్ని ప్రవీణ్ కుమార్ రెపరెపలాడించాడు.
కాగా పారాలింపిక్స్‌లో భారత్ ఆరు పసిడి పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ప్రవీణ్ కుమార్ గోల్డ్‌తో ఈ మేర సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఇక టోక్యోలో భారత్ ఐదు స్వర్ణాలు గెలిచిన విషయం తెలిసిందే. మోకాలి(రెండుకాళ్లకు సమస్య) దిగువ భాగం సరిగా పనిచేయని హై జంపర్లు టీ64 విభాగంలో పోటీపడతారు. అయితే, ప్రవీణ్ ఒక కాలికి మాత్రమే సమస్య ఉంది.
ఇక ప్యారిస్‌లో భారత్‌కు ఇప్పటి వరకు ఆరు పసిడి, తొమ్మిది రజత, పదకొండు కాంస్యాలు వచ్చాయి. ఓవరాల్‌గా 26 మెడల్స్ భారత్ ఖాతాలో ఉన్నాయి.
ప్యారిస్ పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన భారత అథ్లెట్లు
అవనీ లేఖరా- ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1(పారా షూటింగ్)
నితేశ్ కుమార్- పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3(పారా బ్యాడ్మింటన్)
సుమిత్ ఆంటిల్- పురుషుల జావెలిన్ త్రో-ఎఫ్64
హర్వీందర్ సింగ్- పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్(పారా ఆర్చరీ)
ధరంబీర్- పురుషుల క్లబ్ త్రో ఎఫ్51(పారా అథ్లెటిక్స్)
ప్రవీణ్ కుమార్- పురుషుల హై జంప్ టీ64
Praveen Kumar clinches gold 🥇 at #Paris2024 with his season's best jump of 2.08 m 🤯
Watch the #Paralympics LIVE on #JioCinema 👈#ParalympicsOnJioCinema #JioCinemaSports #ParalympicsParis2024 #HighJump pic.twitter.com/k6zLWLU9XD— JioCinema (@JioCinema) September 6, 2024