High jump
-
సరికొత్త చరిత్ర.. భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం
ప్యారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం చేరింది. హై జంప్ టీ64 విభాగంలో ప్రవీణ్ కుమార్ పసిడి పతకం సాధించాడు. టోక్యోలో రజతానికి పరిమితమైన ఈ ఉత్తరప్రదేశ్ పారా అథ్లెట్.. ప్యారిస్‌లో మాత్రం పొరపాట్లకు తావివ్వలేదు. శుక్రవారం నాటి ఈవెంట్లో 21 ఏళ్ల ప్రవీణ్.. అత్యుత్తంగా 2.08 మీటర్ల దూరం దూకి గోల్డ్ మెడల్ ఖాయం చేసుకున్నాడు.సరికొత్త చరిత్రఅమెరికాకు చెందిన డెరెక్ లాక్సిడెంట్(2.06మీ.- రెండోస్థానం), ఉజ్బెకిస్తాన్ పారా అథ్లెట్ తెముర్బెక్ గియాజోవ్(2.03 మీ- మూడో స్థానం)లను వెనక్కి నెట్టి.. స్వర్ణం గెలిచాడు. పారా విశ్వక్రీడ వేదికపై త్రివర్ణ పతకాన్ని ప్రవీణ్ కుమార్ రెపరెపలాడించాడు. కాగా పారాలింపిక్స్‌లో భారత్ ఆరు పసిడి పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ప్రవీణ్ కుమార్ గోల్డ్‌తో ఈ మేర సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఇక టోక్యోలో భారత్ ఐదు స్వర్ణాలు గెలిచిన విషయం తెలిసిందే. మోకాలి(రెండుకాళ్లకు సమస్య) దిగువ భాగం సరిగా పనిచేయని హై జంపర్లు టీ64 విభాగంలో పోటీపడతారు. అయితే, ప్రవీణ్ ఒక కాలికి మాత్రమే సమస్య ఉంది. ఇక ప్యారిస్‌లో భారత్‌కు ఇప్పటి వరకు ఆరు పసిడి, తొమ్మిది రజత, పదకొండు కాంస్యాలు వచ్చాయి. ఓవరాల్‌గా 26 మెడల్స్ భారత్ ఖాతాలో ఉన్నాయి.ప్యారిస్ పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన భారత అథ్లెట్లుఅవనీ లేఖరా- ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1(పారా షూటింగ్)నితేశ్ కుమార్- పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3(పారా బ్యాడ్మింటన్)సుమిత్ ఆంటిల్- పురుషుల జావెలిన్ త్రో-ఎఫ్64హర్వీందర్ సింగ్- పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్(పారా ఆర్చరీ)ధరంబీర్- పురుషుల క్లబ్ త్రో ఎఫ్51(పారా అథ్లెటిక్స్)ప్రవీణ్ కుమార్- పురుషుల హై జంప్ టీ64Praveen Kumar clinches gold 🥇 at #Paris2024 with his season's best jump of 2.08 m 🤯Watch the #Paralympics LIVE on #JioCinema 👈#ParalympicsOnJioCinema #JioCinemaSports #ParalympicsParis2024 #HighJump pic.twitter.com/k6zLWLU9XD— JioCinema (@JioCinema) September 6, 2024 -
తంగవేలు తీన్మార్
ఒకటి, రెండు, మూడు... అతని అడుగులు వేగంగా పడ్డాయి. ఎప్పటిలాగే ఒంటి కాలిపై వేగంగా ముందుకు దూసుకుపోయి చేసిన జంప్ మరో పారాలింపిక్ పతకాన్ని అందించింది. ఒకటి కాదు రెండు కాదు ఇది వరుసగా మూడో పారాలింపిక్ మెడల్... ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా 29 ఏళ్ల మరియప్పన్ తంగవేలు సగర్వంగా నిలిచాడు. హైజంప్‌లో ఎదురులేకుండా సాగిన అతను 2016 ‘రియో’లో స్వర్ణం, 2020 ‘టోక్యో’లో రజతం గెలవగా... 2024 ‘పారిస్’లో కాంస్యం దక్కింది. ఐదేళ్ల వయసులో అంగవైకల్యాన్ని ఎదుర్కొన్న రోజు నుంచి ఇప్పుడు పారా క్రీడల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించే వరకు తంగవేలు సాగించిన ప్రస్థానం అసాధారణం, అందరికీ స్ఫూర్తిదాయం. పేదరికానికి చిరునామాలాంటి కుటుంబంలో జన్మించిన తంగవేలుకు అనూహ్యంగా ఎదురైన వైకల్యం కష్టాలతో పాటు అతనిలో పట్టుదలను కూడా పెంచింది. తమిళనాడు సేలం వద్ద ఒక చిన్న గ్రామం అతనిది. ఆరుగురు పిల్లల కుటుంబంలో అతనొకడు. తండ్రి పట్టించుకోకపోవడంతో తల్లి కూలీ పని, ఆపై కూరగాయలు అమ్మి తీవ్ర ఇబ్బందుల మధ్య పిల్లలను పెంచింది. అలాంటి స్థితిలో ఐదేళ్ల వయసులో స్కూల్‌కు వెళుతుండగా బస్సు ఢీకొనడంతో కుడికాలు కింది భాగాన్ని కోల్పోయాడు. శస్త్రచికిత్స తర్వాత కూడా దానిని ఏం చేయలేమని డాక్టర్లు తేల్చేశారు. కానీ స్కూల్ స్థాయిలో కూడా ఆ చిన్నారి ఎలాంటి బాధను తన దరిచేరనీయలేదు. తనకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే స్కూల్లో ఆ కాలుతోనే అన్ని క్రీడల్లో పాల్గొనేందుకు సిద్ధపడిపోయేవాడు. అన్ని సక్రమంగా ఉన్నవారితో మరీ పోటీ పడి గెలిచేవాడు కూడా. తాను ఎవరికంటే తక్కువ కాదనే భావనను ఇది కలిగించిందని అతను చెప్పుకునేవాడు. వేర్వేరు క్రీడలతో మొదలైనా పీఈటీ సర్ సూచన మేరకు హైజంప్‌ను అతను తన గేమ్‌గా మార్చుకున్నాడు. ఇదే జోరులో ఎక్కడ అవకాశం దొరికినా పోటీలో పాల్గొంటూ జాతీయ పారా క్రీడల వరకు తంగవేలు చేరుకున్నాడు. దివ్యాంగుల క్రీడల్లో శిక్షణ ఇవ్వడంతో మేటి అయిన సత్యనారాయణ దృష్టిలో పడటం తంగవేలు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆయన శిక్షణలో అసలైన ప్రొఫెషనల్ తరహా కోచింగ్ తంగవేలుకు లభించింది. ఫలితంగా పారా క్రీడల్లో తంగవేలుకు వరుస విజయాలు దక్కాయి. ఈ క్రమంలో 2016 రియో పారాలింపిక్స్‌కు అర్హత సాధించడంతో అతని గురించి ప్రపంచానికి తెలిసింది. ఇక ఆ తర్వాత ఒలింపిక్ పతకం, వరల్డ్ చాంపియన్íÙప్లో స్వర్ణాలు తంగవేలుకు పేరు తెచ్చిపెట్టాయి. క్రీడల్లో గుర్తింపు తెచ్చుకొని కొంత డబ్బు రాగానే అతను కుటుంబ కనీస అవసరాలపైనే దృష్టి పెట్టాడు. ముందుగా అమ్మ కోసం కొంత పొలం కొనడం, ఊర్లో సొంత ఇల్లు కట్టుకోవడంవంటివే చేశాడు. ‘అర్జున’... ‘పద్మశ్రీ’... ‘ఖేల్‌రత్న’ అవార్డుల తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్‌గా ఉద్యోగం కూడా దక్కడంతో తంగవేలు స్థిరపడ్డాడు. ఇప్పుడు మూడో ఒలింపిక్ పతకంతో పారా క్రీడల్లో శాశ్వత కీర్తిని అందుకున్నాడు.– సాక్షి క్రీడావిభాగం -
హైజంప్‌లో పూజా సింగ్ జాతీయ రికార్డు
అంతకుముందు భారత యువ అథ్లెట్ పూజా సింగ్ హైజంప్‌లో జాతీయ రికార్డు తిరగరాసింది. 17 ఏళ్ల పూజ 1.83 మీటర్ల ఎత్తు దూకి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో పూజ తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును (1.82 మీటర్లు) బద్దలు కొట్టింది. హరియాణాకు చెందిన తాపీ మేస్త్రీ కూతురైన పూజ క్వాలిఫయింగ్ రౌండ్లో తొమ్మిదో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. సరైన సౌకర్యాలు లేకుండానే అండర్–14 స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్వర్ణం నెగ్గిన పూజ... ఆ తర్వాత 2022 జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో అండర్–16, అండర్–18 పోటీల్లో పసిడి పతకాలు కైవసం చేసుకుంది. -
స్టాక్స్ బుల్ సవారీ
ముంబై: ప్రధానంగా బ్లూచిప్స్‌లో కొనుగోళ్లతో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హైజంప్ చేశాయి. వెరసి ప్రామాణిక ఇండెక్సులు సరికొత్త గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 494 పాయింట్లు ఎగసి 74,742 వద్ద ముగిసింది. నిఫ్టీ 153 పాయింట్లు జమ చేసుకుని 22,666 వద్ద స్థిరపడింది. ఒక దశలో సెన్సెక్స్ 621 పాయింట్లు పురోగమించి 74,869ను తాకింది. ఇక నిఫ్టీ 183 పాయింట్లు బలపడి 22,697 వద్ద గరిష్టాన్ని అందుకుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ర్యాలీ సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వారాంతాన యూఎస్ మార్కెట్లు లాభపడిన సంగతి తెలిసిందే. . మార్కెట్ విలువ రికార్డ్ ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలి సెషన్లో రూ. 401 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్ చరిత్రలో ఇది తొలిసారికాగా.. డాలర్లలో 4.81 ట్రిలియన్లను తాకింది. చివరికి బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 4,00,86,722 వద్ద స్థిరపడింది. గతేడాది జులైలో తొలిసారి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 300 లక్షల కోట్లను తాకిన విషయం విదితమే. బ్లూచిప్స్ దన్ను ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఆయిల్, రియల్టీ, మెటల్ రంగాలు 2.2–1.2 శాతం మధ్య పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, ఐటీ 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, ఎంఅండ్ఎం, మారుతీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ, గ్రాసిమ్, టాటా కన్జూమర్, ఎల్అండ్టీ, ఆర్ఐఎల్, యాక్సిస్, హీరోమోటో, ఎయిర్టెల్ 4–1 శాతం మధ్య ఎగశాయి. అయితే అదానీ పోర్ట్స్, నెస్లే, అపోలో హాస్పిటల్, విప్రో, సన్ ఫార్మా 1.6–0.6 శాతం మధ్య నీరసించాయి. ఆధార్ హౌసింగ్ ఐపీవోకు రెడీ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. మే 20న మార్కెట్లకు సెలవు ముంబైలో సాధారణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మే 20న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 11న ఈద్(రంజాన్), 17న శ్రీరామ నవమి, మే 1న మహారాష్ట్ర డే సందర్భంగా సైతం స్టాక్ మార్కెట్లు పనిచేయవు. -
ఇంటి వద్ద పాలు పోస్తూనే సాధన.. పోటీకి వెళితే పతకమే! కాంస్యంతో సత్తా చాటి..
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రతిభతో ముందుకు దూకుతున్నారు ఆ హైజంపర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అచంచల ఆత్మ విశ్వాసంతో క్రీడా సాధన చేస్తున్నారు. పార్ట్‌టైం జాబ్ చేస్తూనే రాణిస్తున్నారు. ఇటీవల లక్నోలో జరిగిన ఖేలో ఇండియా నేషనల్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుని తన సత్తాచాటారు షేక్ మొహిద్దీన్. పేద కుటుంబం మొహిద్దీన్ది కాకుమాను మండలం రేటూరు గ్రామం. తండ్రి షేక్ షంషుద్దీన్ పదేళ్ల క్రితం మరణించారు. తల్లి నూర్జహాన్ గృహిణి. ఇంటి వద్దే పాలవ్యాపారం చేస్తున్నారు. మొహిద్దీన్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబానికి బాసటగా నిలిస్తున్నారు. ఇద్దరక్కలు పెళ్లిళ్లై వెళ్లిపోయారు. ప్రస్తుతం మొహిద్దీన్ ఇంటి వద్ద పాలు పోస్తూనే గుంటూరులో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. రాత్రి వరకు హైజంప్ సాధన చేస్తున్నారు. పోటీకి వెళితే పతకమే హైజంప్ వైవిధ్యమైన క్రీడ. పోటీ తక్కువగా ఉన్నా, సాధనలో తేడా వస్తే వైకల్యం సంభవించే అవకాశం ఉంది. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన మొహిద్దీన్ ఏ పోటీలకు వెళ్లినా పతకం సాధించి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు 20కుపైగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 10 బంగారు, మరో 10 రజత, కాంస్య పతకాలు సాధించారు. ఏడుసార్లు జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. అన్నింటా ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పూర్తిగా సాధనలో నిమగ్నమైతే దేశానికి అతి త్వరలోనే ప్రాతినిధ్యం వహించే అవకాశముందని అతని శిక్షకులు అంటున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వీలు కావడంలేదు. స్పాన్సర్షిప్ ఇప్పించండి ఖేలో ఇండియా నేషనల్స్‌లో కూడా 2.06 మీటర్ల ఎత్తు జంప్ చేశాను. ఇది బెస్ట్ మీట్ రికార్డ్. అందుకే కాంస్య పతకం వచ్చింది. సాధన, పోటీల్లో పాల్గొనేందుకు స్పాన్సర్షిప్ ఇప్పించాలని మనవి. ఇటీవల శాప్ పెద్దలను కలిశాను. ఒక్క ఏడాది మనస్సుపెట్టి సాధన చేస్తే తప్పకుండా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాను. హైజంప్‌కు నా దేహం చాలా బాగా సహకరిస్తుందని జాతీయస్థాయి శిక్షకులూ చెప్పారు. ఎప్పటికై నా ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరిక – షేక్ మొహిద్దీన్, నేషనల్ హైజంపర్. చదవండి: సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ షురూ.. ఇంతకంటే చెత్త ఆలోచన మరొకటి లేదు: రవిశాస్త్రిని ఏకిపారేసిన గంభీర్ -
వారం కిత్రం పేరు లేదు.. కుక్కలతో హై జంప్ ప్రాక్టీస్
తేజస్విన్ శంకర్.. వారం క్రితం కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికయిన భారత బృందంలో పేరు లేదు. హై జంప్ విభాగంలో క్వాలిఫై స్టాండర్డ్స్ అందుకోలేదన్న కారణంగా చూపి భారత్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ అధికారులు అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో కోర్టు మెట్లు ఎక్కి విజయం సాధించిన తేజస్విన్ శంకర్ ఆఖరి నిమిషంలో కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లనున్న భారత బృందంలో బెర్త్ దక్కించకున్నాడు. తనను ఎంపిక చేయలేదన్న కోపమో లేక బాధో తెలియదు కానీ.. ఇవాళ 30వేల మంది ప్రేక్షకుల సమక్షంలో హై జంప్ విభాగంలో కాంస్య పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన రికార్డును బ్రేక్ చేయలేదన్న బాధ ఉన్నప్పటికి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తరపున హై జంప్ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ చరిత్ర సృష్టించాడు. మరి బర్మింగ్హమ్లో కాంస్యం సాధించిన తేజస్విన్ శంకర్ హై జంప్ ప్రాక్టీస్ ఎలా చేశాడో తెలిస్తే షాకవుతారు. తాను రోజు ప్రాక్టీస్ చేసే జేఎల్ఎన్ గ్రౌండ్లో మూడు కుక్కలు ఉండేవి. వాటిని మచ్చిక చేసుకున్న శంకర్ హై జంప్ ప్రాక్టీస్ చేసేవాడు. రోజు వాటికి ఆహారం అందిస్తూ స్టిక్స్ ఏర్పాటు చేసి వాటి వెనకాల పరిగెత్తుతూ హై జంప్ చేసేవాడు. అలా హైజంప్‌లో మరింత రాటు దేలే ప్రయత్నం చేశాడు. అయితే భారత్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ అతనికి షాక్ ఇచ్చింది. అయితే కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా విజయం సాధించిన తేజస్విన్ శంకర్ కామెన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టాడు. వాస్తవానికి అథ్లెట్ల సంఖ్య కోటా ఎక్కువగా ఉన్నందున శంకర్ పేరును పరిగణలోకి తీసుకోలేదని తర్వాత తేలింది. కట్‌చేస్తే.. కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం హైజంప్ విభాగంలో జరిగిన ఫైనల్లో తేజస్విన్ శంకర్ 2.22 మీటర్ల ఎత్తు దూకి కాంస్యం ఒడిసిపట్టాడు. అయితే జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. శంకర్ గత రికార్డుతో పోల్చితే కామన్వెల్త్లో కొంత నిరాశ పరిచినా ఇది కూడా గొప్ప ఘనత కిందే లెక్కించొచ్చు. ఇక ఈ విభాగంలో న్యూజిలాండ్‌కు చెందిన హమీష్ కెర్ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. A week back Tejaswin Shankar was practising in front of 3 dogs at JLN Stadium, after not being named to the CWG squad despite meeting the AFI QF standard. Included at the last minute after taking the fed to court, today in front of 30000, he wins a high jump bronze in Birmingham. pic.twitter.com/1YDiEsvjE3 — jonathan selvaraj (@jon_selvaraj) August 3, 2022 ☑️First-ever high jump medal for India at CWG ☑️First track and field medal for India in this CWG edition Tejaswin Shankar🙌🏻#CommonwealthGames2022 pic.twitter.com/la6a6APpD5 — The Bridge (@the_bridge_in) August 3, 2022 చదవండి: CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు CWG 2022: వైరల్‌గా మారిన నిఖత్ జరీన్ చర్య.. ఏం జరిగింది? -
CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. హైజంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ హైజంప్ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ రికార్డు సృష్టించాడు. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్థరాత్రి జరిగిన హైజంప్ ఫైనల్స్‌లో శంకర్ 2.22 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌కు చెందిన హమీష్ కెర్ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. అయితే జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. శంకర్ గత రికార్డుతో పోల్చితే కామన్వెల్త్లో కొంత నిరాశ పరిచినప్పటికీ హైజంప్‌లో దేశానికి తొలిపతకం తీసుకొచ్చిన ప్లేయర్‌గా మాత్రం చరిత్రలో నిలిపోయాడు. తాజా పతకంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు 18 పతకాలు ఉండగా.. అందులో 5 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక కాంస్య పతకం సాధించిన శంకర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ''తేజస్విని శంకర్ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. కాంస్య పతకం సాధించినందుకు అభినందనలు. నీ ప్రదర్శన పట్ల దేశం గర్విస్తుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా.'' అంటూ తెలిపారు. ఇక కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా శంకర్‌ను అభినందించారు. కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్ విభాగంలో పతకం సాధించిన మొదటి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడని ప్రశంసించారు. ☑️First-ever high jump medal for India at CWG ☑️First track and field medal for India in this CWG edition Tejaswin Shankar🙌🏻#CommonwealthGames2022 pic.twitter.com/la6a6APpD5 — The Bridge (@the_bridge_in) August 3, 2022 చదవండి: Commonwealth Games 2022: తులిక తెచ్చిన రజతం CWG 2022: బార్బడోస్పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా మహిళలు 🇮🇳🥇 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐈𝐂! Tejaswin Shankar - remember the name! 💪 This is India's first medal in Athletics at #B2022.#TejaswinShankar #B2022 #CWG2022 #HighJump #TeamIndia #BharatArmy pic.twitter.com/7zQ2S8eMAA — The Bharat Army (@thebharatarmy) August 3, 2022 Tejaswin Shankar creates history. He wins our first high jump medal in the CWG. Congratulations to him for winning the Bronze medal. Proud of his efforts. Best wishes for his future endeavours. May he keep attaining success. @TejaswinShankar pic.twitter.com/eQcFOtSU58 — Narendra Modi (@narendramodi) August 4, 2022 -
తేజస్విన్‌కు అనుమతి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత హైజంప్ ప్లేయర్ తేజస్విన్ శంకర్‌కు నిర్వాహకులు అనుమతించారు. ఒకే ఈవెంట్లో వైదొలిగిన ప్లేయర్ స్థానంలో మరొకరికి అనుమతి ఇస్తామని గతంలో తేజస్విన్ ఎంట్రీని నిర్వాహకులు తోసిపుచ్చారు. అయితే శుక్రవారం డెలిగేట్ రిజిస్ట్రేషన్ మీటింగ్ ముగిశాక తేజస్విన్ ఎంట్రీకి పచ్చజెండా ఊపారు. స్వదేశంలో సెలెక్షన్ టోర్నీలో తేజస్విన్ బరిలోకి దిగలేదు. అయితే అతను కామన్వెల్త్ గేమ్స్ అర్హత ప్రమాణాన్ని అమెరికాలో నేషనల్ కాలేజియట్ అథ్లెటిక్స్ మీట్లో నమోదు చేశాడు. కానీ భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) తేజస్విన్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోకుండా అతనిని ఎంపిక చేయలేదు. దాంతో తేజస్విన్ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. చివరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఏఎఫ్ఐ అధికారులు తేజస్విన్ పేరును కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులకు పంపించారు. -
బాంబుల మోత తప్పించుకొని పతకం గెలిచి..
అమెరికాలోని ఒరెగాన్‌లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఉక్రెయిర్ హై జంప్ క్రీడాకారిణి యారోస్లావా మహుచిఖ్ రజతం సాధించింది. అందరిలానే పతకం సాధించిందిగా ఇందులో ఏముందిలే అనుకోవద్దు. యారోస్లావా పతకం సాధించడం ఇప్పుడు పెద్ద విశేషమే. ఎందుకంటే యారోస్లావా ఉక్రెయిన్ దేశస్థురాలు కాబట్టి. దాదాపు నాలుగు నెలలుగా కంటి మీద కునుకు లేకుండా రష్యా ఉక్రెయిన్ మీద దాడులు చేస్తూనే ఉంది. యుద్ధ వాతావరణంలో ఉన్న తన దేశం నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని స్నేహితుల సాయంతో మూడురోజుల పాటు కారులో ప్రయాణించి ఉక్రెయిన్ను దాటి అమెరికాలో అడుగుపెట్టింది. ఒక పక్క ఉక్రెయిన్ బాంబుల మోతతో దద్దరిల్లుతున్నప్పటికి దేశానికి పతకం తేవాలన్న ఆమె సంకల్పాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. అందుకే యారోస్లావా సాధించింది రజతమే అయినా ఆమె దృష్టిలో మాత్రం అది బంగారు పతకమేనని పేర్కొంది. బుధవారం జరిగిన మహిళల హై జంప్ ఫైనల్ రసవత్తరంగా సాగింది. 2.02 మీటర్ల ఎత్తును( దాదాపు 6 అడుగుల ఏడున్నర అంగుళాలు) ఆస్ట్రేలియాకు చెందిన ఎలినర్ పాటర్సన్ క్లియర్ చేసింది. ఆ తర్వాత వచ్చిన యారస్లావా మాత్రం తృటిలో దానిని అందుకోలేకపోయింది. దీంతో పాటర్సన్ స్వర్ణం దక్కించుకోగా.. యారోస్లావా మహుచిఖ్ రజతం గెలిచింది. పతకం సాధించిన అనంతరం యారోస్లావా ఎమెషనల్ అయింది. ''నేను సాధించింది రజతమే కావొచ్చు.. నా దృష్టిలో మాత్రం అది స్వర్ణ పతకం కిందే లెక్క. ఈ పతకం రష్యాతో యుద్దంలో అసువుల బాసిన నా దేశ సైనికులకు.. ప్రజలకు అంకితమిస్తున్నా. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ను దాటడానికి మూడు రోజులు పట్టింది. ఈ క్రమంలో నా ప్రాణాలు పోయినా దేశం కోసం ఆనందంగా ప్రాణత్యాగం చేశాననుకుంటా. దేవుడి దయవల్ల ఈరోజు వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని పతకం సాధించా'' అంటూ చెప్పుకొచ్చింది. అయితే రష్యాకు చెందిన స్టార్ హైజంపర్.. డిపెండింగ్ చాంపియన్ మారియా లసిట్స్కేన్ తమ దేశంపై నిషేధం ఉండడంతో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేకపోయింది. మారియా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడుసార్లు స్వర్ణం సాధించడం విశేషం. Literally flying 🦅@eleanorpatto 🇦🇺 clears a lifetime best of 2.02m on her first attempt to win world high jump title!#WorldAthleticsChamps pic.twitter.com/dSISIzOk75 — World Athletics (@WorldAthletics) July 20, 2022 చదవండి: భారత్‌కు భారీ షాక్.. డోప్ టెస్టులో పట్టుబడ్డ స్టార్ అథ్లెట్లు..! -
సంకల్పిస్తే... రాదన్నది లేదు
కష్టాలేమీ లేనప్పుడు మనలో బలమెంత ఉందో మనకు కూడా తెలియదు. ఆ కష్టం దాటాక మనలోని బలమెంతో మనతోబాటు పదిమందికీ తెలుస్తుంది. ఈ మాటలకు అర్థం ఆరుపదుల వయసులో ఉన్న రాధతో మాట్లాడితే తెలుస్తుంది. పెద్ద వయసులో ఇంకేం చేస్తారులే అనుకోకుండా క్రీడల్లో తనని తాను నిరూపించుకుంటూ నేటి యువతకూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హైదరాబాద్ నిజాంపేటలో ఉంటున్న రాధ ఆరు పదుల వయసులో లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, హ్యామర్ త్రో వంటివి చేస్తూ క్రీడలకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు. ఈ వయసులో మెడల్స్ సాధిస్తూ అథ్లెట్‌గా రాణిస్తున్నారు. క్రీడలంటే ఉన్న ఆసక్తి గురించి మాట్లాడినప్పుడు రాధ తన జీవిత విశేషాలను ఎంతో ఆనందంగా ఇలా పంచుకున్నారు. అవన్నీ నేటి మహిళలకు స్ఫూర్తినిచ్చే వాక్కులు. జీరో నుంచి మొదలు ‘ముప్పై ఐదేళ్లుగా టీచర్‌గా చేస్తున్నాను. పాతికేళ్లుగా స్కూల్స్ నడుపుతున్నాను. నిజానికి నేను సెవంత్ క్లాస్ డ్రాపౌట్ స్టూడెంట్‌ని. పెళ్లి చెయ్యాలి అనుకోగానే ఇంట్లో చదువు మానిపించారు. మెట్రిక్యులేషన్‌కు ఇంటి నుంచే ఫీజు కట్టించారు. ఆ తర్వాత పెళ్లి అయింది. మా వారిది బిజినెస్. ఇద్దరు పిల్లలకు ఐదేళ్లు వచ్చేసరికి బిజినెస్‌లో పూర్తి లాస్. జీవితం జీరో అయిపోయింది. అప్పుడు ఎలా ఈ జీవితాన్ని కొనసాగించాలో అర్థం కాలేదు. పిల్లలు చిన్నవాళ్లు. ఎటూ దిక్కుతోచని పరిస్థితి. ఈ లైఫ్ ఎందుకు అనే డిప్రెషన్ వచ్చేసింది. దాని నుంచి ఎలాగో బయటపడి పెళ్లి తర్వాత చదువును కొనసాగించా. కష్టపడి బీఈడీ చేయడంతో టీచర్‌గా మళ్లీ నా లైఫ్‌ని కొనసాగించాను. డబ్బులు సరిపోవని సాయంత్రాలు ట్యూషన్లు చెప్పడంతో నా పిల్లలకు చదువులు చెప్పించగలిగాను. పిల్లలు పెద్దవడంతో వాళ్లూ నాకు సాయంగా ఉండటం మొదలుపెట్టారు. పదిహేనేళ్లు ఉద్యోగం చేశాక బొల్లారంలో గీతాంజలి స్కూల్ ప్రారంభించాను. ఆ తర్వాత మరో ఐదేళ్లలో నిజాంపేటలో మరో బ్రాంచ్ ఏర్పాటు చేశాను. డిజైనర్ డ్రెస్సులతో విదేశాలకు.. నాకు డ్రెస్ డిజైన్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని ఎందుకు వదులుకోవడం అని స్కూల్ నడుపుతూనే బొటిక్ కూడా స్టార్ట్ చేశా. అది కూడా చాలా సక్సెస్ అయ్యింది. వీటిని తర్వాత్తర్వాత విదేశాలకు ఆర్డర్లమీద పంపించేదాన్ని. అమెరికాలో జరిగిన ఈవెంట్స్‌లో కూడా నా బొటిక్ డిజైన్స్ డిస్ప్లే చేసి, సేల్ చేసేదాన్ని. మెడల్స్‌ను తీసుకొచ్చిన ఇష్టం బిహెచ్ఇఎల్ లో ఉన్నప్పుడు అక్కడి స్టేడియమ్ పిల్లలను స్కేటింగ్‌కి తీసుకెళ్లేదాన్ని. వారిని స్కేటింగ్‌లో వదిలేసి, నేనూ స్పోర్ట్స్‌లో పాల్గొనేదాన్ని. హ్యామర్ త్రోలో పాల్గొన్నప్పుడు సెకండ్ మెడల్ వచ్చింది. దాంతో మరింత పట్టుదల పెరిగింది. స్పోర్ట్స్ మీట్ ఉన్నప్పుడు వారం మొత్తం ప్రాక్టీస్ తప్పనిసరి. హ్యామర్ త్రో కి చాలా ఫిట్నెస్ అవసరం. మహిళల విభాగంలో నాలుగు కేజీల బరువైన ఐరన్ బాల్ని విసరాలి. సాధారణంగా నలభైఐదు దాటాక ఆక్సిజన్ లెవల్స్, శారీరక ఫిట్నెస్ తగ్గుతుంటాయి దీనిని పెంచుకోవాలంటే రోజూ వాకింగ్, వ్యాయామం తప్పనిసరి. దీనివల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అలా, 35 ఏళ్లుగా నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్‌లో పాల్గొంటూ వచ్చాను. దీంతో ఇటీవల బెంగళూరులో జరిగిన టోర్నమెంట్లో నాలుగు మెడల్స్, హన్మకొండలో జరిగిన స్పోర్ట్స్ మీట్లో 3 మెడల్స్ వచ్చాయి. ప్రతి ఏడాది జరిగే స్పోర్ట్స్ మీట్లో తప్పనిసరిగా పాల్గొంటాను. ఫిట్నెస్ లేకుండా డైరెక్ట్‌గా లాంగ్ జంప్ లేదా ట్రిపుల్ జంప్ చేసినా, రన్నింగ్ చేసినా సమస్యలు వస్తాయి. అందుకే రోజూ ఒక గంటైనా ప్రాక్టీస్ చేస్తుంటాను. ఎవరైనా అడిగితే ఉచితంగా కోచింగ్ ఇస్తుంటాను. ఏ జిల్లాలోనైనా పది మంది మహిళలు ‘జట్టుగా ఉన్నాం, మాకు గ్రౌండ్ ఉంది, టోర్నమెంట్లో పాల్గొంటాం’ అని మాకు తెలియజేసినా... అలాంటి వారికి ఉచితంగా కోచ్‌ని ఏర్పాటు చేస్తాం. ఏమీ చేయలేని పరిస్థితులు వచ్చాయి కదా! అనుకున్నప్పుడు మళ్లీ స్టాండ్ అవ్వాలని బలంగా అనుకున్నాను. అలాగే జరిగింది. ఆ రోజుల్లో నేనేమీ చేయలేను అనుకుంటే నా పిల్లల భవిష్యత్తు ఏమయ్యేదో. ఎవరికైనా ఇష్టాయిష్టాలు ఉంటాయి. కానీ, కుటుంబం నిలబడాలంటే త్యాగాలు తప్పవు. కష్టం వస్తేనే సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. కుటుంబం నిలబడాలంటే మనం బలంగా ఉండాలి. అందుకు మనలో ఏ శక్తి ఉందో తెలుసుకొని, ఆచరణలో పెట్టాలి. అప్పుడు తప్పక విజయం సొంతం అవుతుంది’’ అంటూ తన జీవితాన్ని నేటి మహిళలకు ఓ ఉదాహరణగా వివరించారు రాధ. – నిర్మలారెడ్డి -
‘కామన్వెల్త్’కు తేజస్విన్!
న్యూఢిల్లీ: హైజంపర్ తేజస్విన్ శంకర్‌ను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలకు ఎంపిక చేసింది. కోర్టు సూచన మేరకు అమెరికాలో కళాశాల క్రీడల్లో కనబరిచిన అతని ప్రదర్శనను ఏఎఫ్ఐ గుర్తించింది. అర్హత ప్రమాణం (2.27 మీ.) పూర్తి చేసిన తేజస్విన్‌ను బర్మింగ్‌హామ్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తేజస్విన్తోపాటు ఆసియా క్రీడల స్వర్ణ విజేత స్వప్న బర్మన్ (హెప్టాథ్లాన్), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మారథాన్ రన్నర్ శ్రీను బుగత, అనిశ్ థాపా, రిలే రన్నర్ జిల్నాలను కూడా ఎంపిక చేశారు. అయితే ఈ ఐదుగురి పేర్లను భారత ఒలింపిక్ సంఘం ఆమోదిస్తేనే వీరికి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే వీలుంటుంది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులకు తుది జాబితాను ఈనెల 30లోపు పంపించాలి. చదవండి: ENG vs NZ: టెస్టుల్లో బెన్ స్టోక్స్ అరుదైన ఫీట్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా..! -
7వ రోజూ భలే దూకుడు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో అలుపెరుగకుండా రంకెలేస్తున్న బుల్ మరోసారి విజృంభించింది. సూచీలు వరుసగా 7వ రోజూ హైజంప్ చేశాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు ఎగసి 61,766 వద్ద నిలవగా.. నిఫ్టీ 139 పాయింట్లు ఎగసి 18,477 వద్ద ముగిసింది. ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, ఐటీలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 61,963కు చేరగా.. నిఫ్టీ 18,543 పాయింట్లను అధిగమించింది. వెరసి అటు ముగింపు, ఇటు ఇంట్రాడేలోనూ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి! విదేశీ మార్కెట్లలో కనిపిస్తున్న నిరుత్సాహకర ట్రెండ్‌ను సైతం లెక్కచేయకుండా సరికొత్త గరిష్టాలను చేరాయి. ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్ రంగాలు 4 శాతం జంప్‌చేయగా.. ఐటీ 1.6 శాతం ఎగసింది. లాభాల స్వీకరణ నేపథ్యంలో ఫార్మా, హెల్త్‌కేర్, మీడియా ఇండెక్సులు 0.7% బలహీనపడ్డాయి. ఇన్ఫోసిస్ జోరు నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, ఇన్ఫోసిస్ 5 శాతం స్థాయిలో జంప్‌చేయగా.. టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్జీసీ, మారుతీ, యాక్సిస్, ఎస్బీఐ 3.3–1.3 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, బజాజ్ ఆటో, హీరో మోటో, సిప్లా, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా 2–0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. ఈ ఏడాది క్యూ3(జులై–సెప్టెంబర్)లో చైనా జీడీపీ గణాంకాలు నిరాశపరచినప్పటికీ ఎంపిక చేసిన రంగాలలోని బ్లూచిప్ కౌంటర్లలో పెట్టుబడులు సెంటిమెంటుకు బలాన్నిచి్చనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. క్యూ3లో చైనా ఆర్థిక వ్యవస్థ 4.9 శాతమే పుంజుకుంది. ఇందుకు పారిశ్రామికోత్పత్తి అంచనాలను అందుకోకపోవడం ప్రభావం చూపింది. బేస్ మెటల్ ధరలు బలపడటంతో మెటల్ షేర్లకు డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. చిన్న షేర్లు ఓకే... బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం స్మాల్ క్యాప్ 0.7 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,758 లాభపడగా.. 1,696 నీరసించాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 512 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,704 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ఇతర విశేషాలు.. ► పారస్ డిఫెన్స్ షేరు టీ గ్రూప్ నుంచి రోలింగ్ విభాగంలోకి బదిలీ కావడంతో 20% అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో రూ. 125 జమ చేసుకుని రూ. 750 వద్ద ముగిసింది. ► ఈ ఏడాది క్యూ2లో రెట్టింపు నికర లాభం ప్రకటించిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్(డీమార్ట్) షేరు తొలుత 11 శాతం దూసుకెళ్లి రూ. 5,900ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. చివర్లో లాభాల స్వీకరణ ఊపందుకుని చతికిలపడింది. 7.6% పతనమై రూ. 4,920 వద్ద స్థిరపడింది. ► కార్లయిల్ గ్రూప్‌నకు ప్రిఫరెన్స్ షేర్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమకూర్చుకునే ప్రతిపాదనను విరమించుకోవడంతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 5 శాతం లోయర్ సర్క్యూట్‌కు చేరింది. ఎన్ఎస్ఈలో రూ. 32 కోల్పోయి రూ. 607 వద్ద నిలిచింది. ► ఏడు వరుస సెషన్లలో మార్కెట్లు బలపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 12.49 లక్షల కోట్లమేర ఎగసింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,74,69,607 కోట్లకు చేరింది. ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం! ► గత ఏడు రోజుల్లో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 2,576 పాయింట్లు(4.4 శాతం) దూసుకెళ్లింది. -
Tokyo Paralympics: అవని అద్వితీయం
దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత మహిళా టీనేజ్ షూటర్ అవనీ లేఖరా అద్భుతాన్ని ఆవిష్కరించింది గత సోమవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ –1 విభాగంలో స్వర్ణం సాధించిన 19 ఏళ్ల ఈ రాజస్తానీ షూటర్ శుక్రవారం 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఎస్‌హెచ్–1 ఈవెంట్లో కాంస్యం సాధించింది. తద్వారా పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మరోవైపు హర్వీందర్ సింగ్ కాంస్యం రూపంలో ఆర్చరీలో భారత్ తొలి పతకం నెగ్గగా... అథ్లెట్ ప్రవీణ్ కుమార్ హైజంప్‌లో రజతం సాధించాడు. దాంతో శుక్రవారం భారత్ ఖాతాలో మొత్తం మూడు పతకాలు చేరాయి. బ్యాడ్మింటన్‌లో కనీసం రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఓవరాల్‌గా భారత్ 2 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో 37వ స్థానంలో ఉంది. టోక్యో: దివ్యాంగుల విశ్వ క్రీడల్లో శుక్రవారం భారత క్రీడాకారులు మెరిశారు. ఏకంగా మూడు పతకాలు గెలిచి మురిపించారు. మహిళల షూటింగ్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో 19 ఏళ్ల అవనీ లేఖరా కాంస్య పతకం నెగ్గింది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల అవని 445.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. 16 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో అవని 1176 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. టోక్యో పారాలింపిక్స్‌లో అవనికిది రెండో పతకం. గత సోమవారం అవని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్–1 విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతో పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవని గుర్తింపు పొందింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్ అవని. 1984 పారాలింపిక్స్‌లో జోగిందర్ సింగ్ మూడు పతకాలు గెలిచాడు. ఆయన షాట్‌పుట్‌లో రజతం, జావెలిన్ త్రోలో కాంస్యం, డిస్కస్ త్రోలో కాంస్యం సాధించాడు. ‘షూట్ ఆఫ్’లో సూపర్... టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్ నిరాశపరిచినా... టోక్యో పారాలింపిక్స్‌లో మాత్రం హరీ్వందర్ సింగ్ అద్భుతం చేశాడు. విశ్వ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన పురుషుల రికర్వ్ ఓపెన్ వ్యక్తిగత విభాగంలో హరియాణాకు చెందిన 31 ఏళ్ల హరీ్వందర్ కాంస్య పతకం గెలిచాడు. కాంస్యం గెలిచే క్రమంలో హరీ్వందర్ మూడు ‘షూట్ ఆఫ్’లను దాటడం విశేషం. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్ సుతో జరిగిన కాంస్య పతక పోరులో హర్వీందర్ ‘షూట్ ఆఫ్’లో 10–8తో నెగ్గాడు. అంతకుముందు ఇద్దరు 5–5తో సమఉజ్జీగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... హర్వీందర్ 10 పాయింట్ల షాట్ కొట్టాడు. కిమ్ మిన్ సు 8 పాయింట్ల షాట్‌తో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు తొలి రౌండ్లో హరీ్వందర్ సింగ్ ‘షూట్ ఆఫ్’లో 10–7తో స్టెఫానో ట్రావిసాని (ఇటలీ)పై... ప్రిక్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లోనే 8–7తో బాటో టిసిడెన్డోర్జియెవ్ (రష్యా ఒలింపిక్ కమిటీ)పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో హరీ్వందర్ 6–2తో మైక్ జార్జెవ్స్కీ (జర్మనీ)పై నెగ్గాడు. అయితే సెమీఫైనల్లో హరీ్వందర్ 4–6తో కెవిన్ మాథెర్ (అమెరికా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకం బరిలో నిలిచాడు. భారత్‌కే చెందిన మరో ఆర్చర్ వివేక్ చికారా ప్రిక్వార్టర్ ఫైనల్లో 3–7తో డేవిడ్ ఫిలిప్స్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. పొలంలో సాధన చేసి... హరియాణాలోని కైథాల్ జిల్లాలోని గుహ్లా చీకా గ్రామానికి చెందిన హరీ్వందర్ ప్రస్తుతం పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేస్తున్నాడు. అతనికి ఏడాదిన్నర వయసు ఉండగా డెంగ్యూ బారిన పడ్డాడు. ఆ సమయంలో స్థానిక డాక్టర్ ఒకరు హర్వీందర్‌కు ఇచి్చన ఇంజెక్షన్ విక టించింది. దాంతో హరీ్వందర్ కాళ్లలో సరైన కదలిక లేకుండా పోయింది. గత ఏడాది కరోనా లాక్డౌన్ కారణంగా హరీ్వందర్ ప్రాక్టీస్‌కు దూరమై తన గ్రామంలో ఉండిపోవాల్సి వచి్చంది. ఈ దశలో హరీ్వందర్కు ఓ ఆలోచన తట్టింది. అప్పటికే పంటను కోయడంతో ఖాళీగా ఉన్న తమ పొలంలోనే ఆర్చరీ రేంజ్‌ను ఏర్పాటు చేసుకొని హర్వీందర్ రోజూ రెండుసార్లు సాధన చేశాడు. అతని సాధనకు పారాలింపిక్స్‌లో పతకం రూపంలో ఫలితం వచ్చింది. ప్రవీణ్... ఆసియా రికార్డు... రజతం... పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి64 కేటగిరీలో పాల్గొన్న 18 ఏళ్ల ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు. రెండేళ్ల క్రితమే ఈ ఆటలో అడుగుపెట్టిన ప్రవీణ్ 2.07 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ఆసియా రికార్డు సృష్టించడంతోపాటు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. బరిలోకి దిగిన తొలిసారే పతకం సాధించడం చాలా ఆనందంగా ఉందని ప్రవీణ్ అన్నాడు. జొనాథన్ బ్రూమ్ ఎడ్వర్డ్స్ (బ్రిటన్–2.10 మీటర్లు) స్వర్ణం సాధించగా... లెపియాటో (పోలాండ్–2.04 మీటర్లు) కాంస్యం గెలిచాడు. మహిళల ఎఫ్–51 డిస్కస్ త్రో విభాగంలో భారత్‌కు చెందిన కశిష్ లాక్రా (12.66 మీటర్లు) ఆరో స్థానంలో, ఏక్తా (8.38 మీటర్లు) ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల షాట్‌ఫుట్ ఎఫ్–56 విభాగం ఫైనల్లో భారత్‌కు చెందిన సోమన్ రాణా (13.81 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు ఖాయం పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగంలో భారత ప్లేయర్లు సుహాస్ యతిరాజ్, తరుణ్... ఎస్ఎల్–3 విభాగంలో ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. తద్వారా భారత్‌కు కనీసం రెండు పతకాలను ఖాయం చేశారు. -
టోక్యో పారాలింపిక్స్: పురుషుల హై జంప్‌లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు
-
ప్రవీణ్ కూమార్‌కు రజతం.. భారత్ ఖాతాలో 11 పతకాలు
టోక్యో: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్స్ సత్తా చాటుతున్నారు. శుక్రవారం భారత ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల హైజంప్ T64 విభాగంలో ప్రవీణ్ కూమార్ రజత పతకాన్ని సాధించాడు. దీంతో భారత ఖాతాలోకి 11 పతకాలు చేరాయి. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ప్రవీణ్ కూమార్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. చదవండి: IND Vs ENG 4th Test: పడినా...పడగొట్టారు..! Proud of Praveen Kumar for winning the Silver medal at the #Paralympics. This medal is the result of his hard work and unparalleled dedication. Congratulations to him. Best wishes for his future endeavours. #Praise4Para — Narendra Modi (@narendramodi) September 3, 2021 -
Tokyo Paralympics: ‘హై’ పైకి...
దివ్యాంగుల విశ్వక్రీడల్లో ఈసారి గతంలో కంటే ఘనమైన ప్రదర్శన చేస్తామని ప్రకటించిన భారత పారాథ్లెట్స్ అన్నమాట నిలబెట్టుకున్నారు. అంచనాలకు మించి రాణిస్తూ అబ్బురపరుస్తున్నారు. ఆదివారం రెండు పతకాలు సాధించిన మనోళ్లు... సోమవారం ఏకంగా ఐదు పతకాలు నెగ్గగా... మంగళవారం మరో మూడు పతకాలు సొంతం చేసుకున్నారు. దాంతో భారత్ గెలిచిన పతకాల సంఖ్య 10కి చేరింది. ఒకే ఒలింపిక్స్‌లోగానీ, పారాలింపిక్స్‌లోగానీ భారత పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఇదే ప్రథమం. గత నెలలో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యధికంగా ఏడు పతకాలు నెగ్గగా... తాజాగా టోక్యోలోనే జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ 10 పతకాలతో కొత్త చరిత్ర సృష్టించింది. టోక్యో: పారాలింపిక్స్‌లో వరుసగా మూడో రోజు భారత దివ్యాంగ క్రీడాకారులు పతకాల పంట పండించారు. పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి–42 కేటగిరీలో మరియప్పన్ తంగవేలు రజతం నెగ్గగా... ఇదే విభాగంలో శరద్ కుమార్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. టి–42 కేటగిరీలో కాళ్లలో లోపం, కాళ్ల పొడవులో వ్యత్యాసం, బలహీనమైన కండరాల శక్తి, క్రియాశీలకమైన కదలికలు లేని వారు పాల్గొనవచ్చు. షూటింగ్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్–1 కేటగిరీలో సింగ్‌రాజ్ అధానా కాంస్య పతకం గెల్చుకున్నాడు. ఫలితంగా మంగళవారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. ఓవరాల్‌గా భారత్ 10 పతకాలతో 30వ స్థానంలో ఉంది. ఒలింపిక్స్‌లోగానీ, పారాలింపిక్స్‌లోగానీ భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఇదే తొలిసారి. నాలుగేళ్ల క్రితమే షూటింగ్ క్రీడలో అడుగుపెట్టిన సింగ్‌రాజ్ పాల్గొన్న తొలి పారాలింపిక్స్‌లోనే పతకంతో మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సింగ్‌రాజ్ 216.8 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం గెలిచాడు. చావో యాంగ్ (చైనా–237.9 పాయిం ట్లు) స్వర్ణం, జింగ్ హువాంగ్ (చైనా–237.5 పాయింట్లు) రజతం సాధించారు. ఫైనల్లో పాల్గొన్న మరో భారత షూటర్ మనీశ్ నర్వాల్ 135.8 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచాడు. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్–1 కేటగిరీ ఫైనల్లో భారత షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ ఏడో స్థానంలో నిలిచింది. సొంతంగా రేంజ్ ఏర్పాటు చేసుకొని... హరియాణాలోని ఫరీదాబాద్ పట్టణానికి చెందిన 39 ఏళ్ల సింగ్‌రాజ్ చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. అయితే షూటింగ్‌వైపు మాత్రం అతను 35 ఏళ్ల వయసులో ఆకర్షితుడయ్యాడు. తన మేనల్లుడిని షూటింగ్ రేంజ్‌కు తీసుకెళ్లే క్రమంలో అక్కడే సరదాగా ప్రాక్టీస్ చేసిన సింగ్‌రాజ్ ఆటపట్ల మక్కువ పెంచుకొని సీరియస్‌గా సాధన చేయడం ప్రారంభించాడు. కోచ్‌లు ఓంప్రకాశ్, జేపీ నౌటియాల్, జాతీయ కోచ్ సుభాశ్ రాణా శిక్షణలో రాటుదేలిన సింగ్‌రాజ్ 2018లో ఆసియా పారాగేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడు. ఆ తర్వాతి ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన ప్రపంచకప్‌లో రజతం, స్వర్ణం గెలిచాడు. యూఏఈలో ఈ ఏడాది జరిగిన పారాస్పోర్ట్ వరల్డ్‌కప్‌లో స్వర్ణం గెలిచిన సింగ్‌రాజ్ కోవిడ్–19 సమయంలో షూటింగ్ రేంజ్‌లకు తాళాలు పడటంతో ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడ్డాడు. పారాలింపిక్స్‌లో ఎలాగైనా పతకం సాధించాలనే లక్ష్యంతో ఉన్న సింగ్‌రాజ్ కుటుంబసభ్యుల ఆర్థిక సహాయంతో ఇంట్లోనే సొంతంగా షూటింగ్ రేంజ్‌ను ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ కొనసాగించాడు. విశ్వ క్రీడల్లో పతకంతో తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. మళ్లీ మెరిసిన తంగవేలు... 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన మరియప్పన్ తంగవేలు టోక్యోలోనూ అదరగొట్టాడు. పురుషుల హైజంప్ టి–42 విభాగంలో పోటీపడిన ఈ తమిళనాడు ప్లేయర్ 1.86 మీటర్ల ఎత్తుకు ఎగిరి రజత పతకం సాధించాడు. తాను స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగినప్పటికీ పోటీలు జరుగుతున్న సమయంలో వర్షం కురవడం తన స్వర్ణావకాశాలను ప్రభావితం చేసిందని 26 ఏళ్ల తంగవేలు అన్నాడు. ఐదేళ్ల ప్రాయంలో బస్సు ప్రమాదానికి గురై కుడి కాలును కోల్పోయిన తంగవేలు స్కూల్లో వ్యాయామవిద్య ఉపాధ్యాయుడి సలహాతో అథ్లెటిక్స్‌లో అడుగుపెట్టాడు. కూరగాయాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న తన తల్లి సరోజకి చేదోడు వాదోడుగా ఉండేందుకు తంగవేలు 2012 నుంచి 2015 మధ్య కాలంలో ఇళ్లల్లో పేపర్లు వేశాడు. 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి తంగవేలు ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ‘రియో’ పతకంతో లభించిన నగదు ప్రోత్సాహకాలతో ఆర్థికంగా స్థిరపడ్డాడు. 2024 పారిస్ పారాలింపిక్స్‌లోనూ పాల్గొంటానని, ఆ క్రీడల్లో స్వర్ణం సాధించేందుకు ఇప్పటి నుంచే సాధన మొదలుపెడతానని తంగవేలు వ్యాఖ్యానించాడు. నాన్న సలహాతో... టి–42 విభాగంలోనే పోటీపడిన మరో భారత హైజంపర్ శరద్ కుమార్ 1.83 మీటర్ల ఎత్తుకు ఎగిరి కాంస్య పతకాన్ని సాధించాడు. బిహార్‌కు చెందిన 29 ఏళ్ల శరద్ రెండేళ్లుగా ఉక్రెయిన్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. సోమవారం రాత్రి మోకాలి నొప్పితో బాధపడ్డ శరద్ ఈవెంట్ నుంచి వైదొలగాలని భావించాడు. అయితే తండ్రి సూచన మేరకు భగవద్గీత పఠించి మంగళవారం ఈవెంట్లో పాల్గొని శరద్ పతకం సాధించాడు. ‘సోమవారం రాత్రంతా మోకాలి నొప్పితో బాధపడ్డాను. ఈ విషయాన్ని ఫోన్లో నాన్నకు వివరించాను. ఈవెంట్లో పాల్గొనడం కష్టమని చెప్పాను. పట్టుదల కోల్పోకుండా తనవంతు ప్రయత్నం చేయాలని... తమ నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచించకూడదని నాన్న సలహా ఇచ్చారు. భగవద్గీత చదవాలని సూచించారు’ అని రెండేళ్ల ప్రాయంలో పోలియో బారిన పడ్డ శరద్ వివరించాడు. -
Paralympics 2021: భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు..
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ T-63 విభాగంలో మరియప్పన్ తంగవేల్ భారత్‌కు రజత పతకం సాధించగా,శరధ్ కూమార్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలోకి మొత్తం 10 పతకాలు చేరాయి. మరియప్పన్ తంగవేల్, శరధ్ కూమార్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. 2016 రియో పారాలింపిక్స్‌లో మరియప్పన్ గోల్డ్ మెడల్ సాధించాడు. అంతకు ముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో సింగ్‌రాజ్ అధానా కాంస్య పతకం సాధించాడు. పారా ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, 5 రజతాలు, మూడు కాంస్య పతకాలతో భారత్ 30వ స్థానంలో ఉంది. చదవండి: Dale Steyn: అన్ని క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన స్టార్ బౌలర్ Soaring higher and higher! Mariyappan Thangavelu is synonymous with consistence and excellence. Congratulations to him for winning the Silver Medal. India is proud of his feat. @189thangavelu #Paralympics #Praise4Para pic.twitter.com/GGhtAgM7vU — Narendra Modi (@narendramodi) August 31, 2021 The indomitable @sharad_kumar01 has brought smiles on the faces of every Indian by winning the Bronze Medal. His life journey will motivate many. Congratulations to him. #Paralympics #Praise4Para pic.twitter.com/uhYCIOoohy — Narendra Modi (@narendramodi) August 31, 2021 -
నిశాద్ సూపర్ జంప్...
పురుషుల అథ్లెటిక్స్ హైజంప్‌లో 21 ఏళ్ల నిశాద్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. టి–47 విభాగంలో నిశాద్ 2.06 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఆసియా రికార్డు కూడా నెలకొల్పాడు. డాలస్ వైజ్ (అమెరికా) కూడా 2.06 మీటర్ల ఎత్తుకు ఎగరడంతో అతనికి కూడా రజతం లభించింది. రోడెరిక్ టౌన్సెండ్ (అమెరికా) 2.15 మీటర్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. చేయి లేకపోతేనేం... మన దైనందిన పనులు చక్కబెట్టేదే కుడి చేయి. అలాంటి చేతినే కోల్పోతే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఎంత కష్టమైనా, ఓ చేయి లేకపోయినా పతకం గెలవడం నిజంగా విశేషమే కదా! హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల నిశాద్ కుమార్ అదేపని చేశాడు. నిశాద్ది రైతు కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. ఉనా జిల్లాలోని అంబ్ గ్రామంలో సాగుబడే వారి జీవనాధారం. 8 ఏళ్ల వయసులో వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన నిశాద్ గడ్డికోసే యంత్రంలో గడ్డిని కత్తిరిస్తుండగా కుడి చేయి తెగిపడింది. అప్పుడు విలవిల్లాడిన ఆ బాలుడు రెండేళ్లకే క్రీడాశిక్షణపై దృష్టిపెట్టాడు. స్కూల్ గ్రౌండ్లో హైజంప్‌లో ప్రాక్టీస్ చేసేవాడు. జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఏకంగా సాధారణ అథ్లెట్లతో పోటీపడి పదో స్థానంలో నిలిచాడు. పాఠశాల విద్య అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పంచ్కులాలోని దేవిలాల్ స్టేడియంలో హైజంప్‌లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడే నిశాద్ పారాథ్లెట్గా ఎదిగాడు. 2019లో తొలి సారి దుబాయ్‌లో పోటీపడ్డాడు. అక్కడ జరిగిన ఫజార్ పారాథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రిలో అతను టి47 కేటగిరీ హైజంప్‌లో 1.92 మీటర్లు జంప్ చేసి విజేతగా నిలిచాడు. అనంతరం అక్కడే జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 1.94 మీటర్ల జంప్‌తో కాంస్యం సాధించాడు. దీంతోనే టోక్యో పారాలింపిక్స్ కోటా దక్కింది. గత ఏడాది కాలంగా రెండుసార్లు కోవిడ్ బారిన పడినా కూడా ప్రాక్టీస్‌ను అలక్ష్యం చేయలేదు. నాలుగు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న అనుభవంతో తాజాగా దివ్యాంగుల విశ్వక్రీడల్లో రజత పతకం గెలిచాడు. -
వినోద్ కూమార్‌కు కాంస్యం.. భారత్ ఖాతాలో మూడో పతకం
Update: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో డిస్కస్ త్రో విభాగంలో వినోద్ కూమార్ కాంస్య పతకం సాధించాడు. దీంతో పారాలింపిక్స్‌లో ఒకేరోజు మూడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల హై జంప్ T47 విభాగంలో నిషద్ కూమార్ రజత పతకం సాధించాడు. 24 మంది సభ్యుల అథ్లెటిక్స్ జట్టులో నిషిద్ కూమార్ 2.06 మీటర్లు ఎత్తు ఎగిరి రెండో స్థానం లో నిలిచాడు. దీంతో నిషద్ కుమార్ రజతం కైవసం చేసుకున్నాడు.మరో వైపు ఆదివారం భవీనా బెన్ పటేల్ టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించింది. పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న అథ్లెట్ నిషాద్ కుమార్‌ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. పురుషల హై జంప్ టీ47 విభాగంలో నిషాద్ కుమార్ రజతం సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Congratulations to Nishad kumar for winning silver 🇮🇳🇮🇳… Great work 🙏🙏#TokyoParalympics #Tokyo2020 … https://t.co/hQQ9PvK4M7 — Saina Nehwal (@NSaina) August 29, 2021 More joyful news comes from Tokyo! Absolutely delighted that Nishad Kumar wins the Silver medal in Men’s High Jump T47. He is a remarkable athlete with outstanding skills and tenacity. Congratulations to him. #Paralympics A JUMP TO #SILVER! 😍 Asian record holder Nishad Kumar jumps 2.06m in Men's High Jump T47 Final to earn #IND's second medal of the day - setting another new Asian record along the way! 🤩#Tokyo2020 #Paralympics #ParaAthletics @nishad_hj pic.twitter.com/t3M5VZdL68 — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 29, 2021 — Narendra Modi (@narendramodi) August 29, 2021 India is rejoicing thanks to Vinod Kumar’s stupendous performance! Congratulations to him for the Bronze Medal. His hard work and determination is yielding outstanding results. #Paralympics — Narendra Modi (@narendramodi) August 29, 2021 చదవండి: మరో టీమ్‌కు ధోని కెప్టెన్.. మిగతా 10 మంది వీళ్లే! -
Tejaswin Shankar: అద్భుత ఫీట్.. మరో స్వర్ణం సొంతం
న్యూఢిల్లీ: బిగ్–12 అవుట్డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ పురుషుల హైజంప్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించాడు. అమెరికాలోని మ్యాన్‌హాటన్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్లో 22 ఏళ్ల తేజస్విన్ కేన్సస్ స్టేట్ యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తూ 2.28 మీటర్ల ఎత్తుకు ఎగిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ టోర్నీలో తేజస్విన్‌కిది రెండో స్వర్ణం. 2019లోనూ అతను పసిడి పతకం నెగ్గగా... 2020లో కరోనా కారణంగా టోర్నీ జరగలేదు. తమిళనాడుకు చెందిన తేజస్విన్ 2017లో అమెరికాకు వెళ్లి కేన్సస్ స్టేట్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు అభ్యసిస్తూ అథ్లెటిక్స్ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. 🐰🐰🐰🐰#KStateTF x @TejaswinShankar pic.twitter.com/wyoGfhJWw2 — K-State Track (@KStateTFXC) May 15, 2021 TJ to the moon 🚀 🛸 🌎 ° 🌓 • .°• 🚀 ✯ @TejaswinShankar ★ * ° 🛰 °· 🪐 . • ° ★ • ☄ pic.twitter.com/atTexyXRCI — K-State Track (@KStateTFXC) May 15, 2021 -
సెన్సెక్స్‌ప్రెస్.. ఆటో, ఐటీ స్పీడ్
కొద్ది రోజుల కన్సాలిడేషన్ తదుపరి తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 558 పాయింట్లు జంప్‌చేసింది. 38,493 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 169 పాయింట్లు ఎగసి 11,300 వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలతో హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు సమయం గడిచేకొద్దీ మరింత ఊపందుకున్నాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,555 వద్ద గరిష్టాన్ని చేరగా.. 37,998 వద్ద కనిష్టాన్ని నమోదు చేసుకుంది. ఇదేవిధంగా నిఫ్టీ 11,318- 11,151 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. యూఎస్, యూరోపియన్ దేశాల ప్యాకేజీలు, ఫెడ్ పాలసీ సమీక్ష నేపథ్యంలో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో మీడియా(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఆటో, ఐటీ, మెటల్ 3.2-2.25 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో రియల్టీ 1.6 శాతం, ఫార్మా 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్ 7 శాతం జంప్‌చేయగా.. కొటక్ బ్యాంక్, టీసీఎస్, గ్రాసిమ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్, హిందాల్కో, శ్రీ సిమెంట్, హీరో మోటో 5-4 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఐసీఐసీఐ, ఇన్ఫ్రాటెల్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, ఐవోసీ, జీ 1.8-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. జీఎంఆర్ జోరు డెరివేటివ్ కౌంటర్లలో జీఎంఆర్, అపోలో హాస్పిటల్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఎస్కార్ట్స్, రామ్‌కో సిమెంట్, అంబుజా సిమెంట్ 8.4-4.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. బీఈఎల్, హావెల్స్, ముత్తూట్, బర్జర్ పెయింట్స్, పెట్రోనెట్, ఐసీఐసీఐ ప్రు, యూబీఎల్ 3.3-1.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1335 లాభపడగా.. 1311 నష్టపోయాయి. అమ్మకాలవైపు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 453 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 978 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 410 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1003 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
హైజంప్‌లో ప్రణయ్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తొలిరోజు తెలంగాణ అథ్లెట్లు పతకాల పంట పండించారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో జరుగుతోన్న ఈ టోర్నీలో మొత్తం 16 పతకాలను సాధించారు. ఇందులో 3 స్వర్ణాలు, 8 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి. అండర్–14 బాలుర హై జంప్‌లో కె. ప్రణయ్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. అతను అందరికన్నా ఎక్కువగా 1.75మీ. జంప్ చేసి విజేతగా నిలిచాడు. 100మీ. పరుగులో గౌతమ్ 11.8సెకన్లలో లక్ష్యాన్ని చేరి బంగారు పతకాన్ని అందుకున్నాడు. అండర్–18 బాలికల 100మీ. పరుగులో దీప్తి జీవంజి 12.11సెకన్లలో పరుగును పూర్తిచేసి చాంపియన్‌గా నిలిచింది. అండర్–14 బాలుర 100మీ. పరుగులో హర్ష (11.81సె.), అండర్–18 బాలికల 100మీ. పరుగులో కియాషా (12.41సె.), అండర్–16 బాలికల 400మీ. పరుగులో మైథిలీ (58.79సె.), బాలుర విభాగంలో మహేశ్ (50.28సె.), అండర్–20 బాలికల 1500మీ. పరుగులో మహేశ్వరి (4ని.42.00సె.), అండర్–16 బాలుర 2000మీ. పరుగులో యరమాకల రెడ్డి (5ని.57.13సె.), అండర్–18 బాలికల 100మీ. హర్డిల్స్‌లో నందిని (15.19సె.) రన్నరప్‌లుగా నిలిచి రజత పతకాలను సొంతం చేసుకున్నారు. అండర్–16 బాలుర 100మీ. పరుగులో దిలీప్ (11.53సె.), అండర్–18 బాలికల 100మీ. హర్డిల్స్‌లో శ్రీ పద్మ (15.34సె.), అండర్–20 బాలుర షాట్‌పుట్‌లో సత్యవాన్ (15.94మీ.) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను గెలుచుకున్నారు. -
చివర్లో మెరుపులు: దలాల్‌స్ట్రీట్ హై జంప్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంనుంచీ భారీ ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు ఆఖరి గంటలో భారీ లాభాలనార్జించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో షేర్ల లాభాలు మార్కెట్లకు బలాన్నిచ్చాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 239 పాయింట్లు ఎగిసి 38,939 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 11 671 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 11650స్థాయికి ఎగువన ముగిసింది. ఎస్ బ్యాంకు, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, కోల్ఇండియా, సన్ ఫార్మ, టొరంటోఫార్మ, ఏఐఐ ఇంజనీరింగ్, దీవాన్ హౌసింగ్, హెచ్‌సీఎల్ టెక్, వేదాంతా, ఐవోసీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఏసియన్ పెయింట్స్ 3శాతానికి పైగా నష్టపోగా, ఇంకా కోరమండల్, ఇండియా బుల్స్ హౌసింగ్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. -
దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఎన్నికల బూస్ట్‌తో భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. లోక్‌సభకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆరంభంలోనే ఉత్సాహంగా ఉన్న స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ట్రిపుల్ సెంచరీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఫలితంగా ఇంట్రాడేలో 37,000 పాయింట్ల మైలురాయిని తాకింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో తొలుత లాభాల సెన్సెక్స్ 336 పాయింట్లు జంప్‌చేసి 37011 వద్ద , నిఫ్టీ సైతం 121 పాయింట్లు ఎగసి 11,157 వద్ద కొనసాగుతోంది. ఉపాధి గణాంకాలు నిరాశపరచడంతో శుక్రవారం అమెరికా మార్కెట్లు నీరసించగా.. బ్రెక్సిట్‌పై ఓటింగ్ నేపథ్యంలో యూరోపియన్ మార్కెట్లు సైతం వెనకడుగు వేశాయి. ఆసియాలో మిశ్రమ ధోరణి నెలకొంది. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో, ఫార్మా ఎఫ్ఎంసీజీ, రియల్టీ లాభాపడుత్నునాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ, కోల్ ఇండియా, ఇన్ఫ్రాటెల్, ఎయిర్టెల్, వేదాంతా, ఎన్టీపీసీ, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్ జెట్ ఎయిర్వేస్ 6.4-2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోవైపు ఇండస్ఇండ్, టీసీఎస్ మాత్రమే స్వల్పంగా నష్టపోతున్నాయి. -
తంగవేలు పెద్ద మనసు
చెన్నై: పారాలింపిక్స్ హైజంప్‌లో స్వర్ణం తో భారత గౌరవాన్ని పెంచిన దివ్యాంగ అథ్లెట్ తంగవేలు మరియప్పన్... ఇప్పు డు దాతృత్వంలోనూ తన పెద్ద మనసును చూపించాడు. పతకం సాధించినందుకు తనకు లభిస్తున్న మొత్తంలో నుంచి రూ.30 లక్షల రూపాయలు తనకు ఓనమాలు నేర్పిన ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇస్తున్నాడు.