సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఎన్నికల బూస్ట్‌తో భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. లోక్‌సభకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆరంభంలోనే ఉత్సాహంగా ఉన్న స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ట్రిపుల్ సెంచరీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఫలితంగా ఇంట్రాడేలో 37,000 పాయింట్ల మైలురాయిని తాకింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో తొలుత లాభాల సెన్సెక్స్ 336 పాయింట్లు జంప్‌చేసి 37011 వద్ద , నిఫ్టీ సైతం 121 పాయింట్లు ఎగసి 11,157 వద్ద కొనసాగుతోంది. ఉపాధి గణాంకాలు నిరాశపరచడంతో శుక్రవారం అమెరికా మార్కెట్లు నీరసించగా.. బ్రెక్సిట్‌పై ఓటింగ్ నేపథ్యంలో యూరోపియన్ మార్కెట్లు సైతం వెనకడుగు వేశాయి. ఆసియాలో మిశ్రమ ధోరణి నెలకొంది.
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో, ఫార్మా ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ లాభాపడుత్నునాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ, కోల్ ఇండియా, ఇన్‌ఫ్రాటెల్, ఎయిర్‌టెల్, వేదాంతా, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్ జెట్ ఎయిర్‌వేస్ 6.4-2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోవైపు ఇండస్‌ఇండ్, టీసీఎస్ మాత్రమే స్వల్పంగా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment