సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంనుంచీ భారీ ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు ఆఖరి గంటలో భారీ లాభాలనార్జించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో షేర్ల లాభాలు మార్కెట్లకు బలాన్నిచ్చాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 239 పాయింట్లు ఎగిసి 38,939 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 11 671 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 11650స్థాయికి ఎగువన ముగిసింది.
ఎస్ బ్యాంకు, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, కోల్‌ఇండియా, సన్ ఫార్మ, టొరంటోఫార్మ, ఏఐఐ ఇంజనీరింగ్, దీవాన్ హౌసింగ్, హెచ్‌సీఎల్ టెక్, వేదాంతా, ఐవోసీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఏసియన్ పెయింట్స్ 3శాతానికి పైగా నష్టపోగా, ఇంకా కోరమండల్, ఇండియా బుల్స్ హౌసింగ్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment