న్యూఢిల్లీ: బిగ్–12 అవుట్‌డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ పురుషుల హైజంప్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. అమెరికాలోని మ్యాన్‌హాటన్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో 22 ఏళ్ల తేజస్విన్ కేన్సస్ స్టేట్ యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తూ 2.28 మీటర్ల ఎత్తుకు ఎగిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు.
ఈ టోర్నీలో తేజస్విన్‌కిది రెండో స్వర్ణం. 2019లోనూ అతను పసిడి పతకం నెగ్గగా... 2020లో కరోనా కారణంగా టోర్నీ జరగలేదు. తమిళనాడుకు చెందిన తేజస్విన్ 2017లో అమెరికాకు వెళ్లి కేన్సస్ స్టేట్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు అభ్యసిస్తూ అథ్లెటిక్స్ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.
🐰🐰🐰🐰#KStateTF x @TejaswinShankar pic.twitter.com/wyoGfhJWw2
— K-State Track (@KStateTFXC) May 15, 2021
TJ to the moon 🚀
— K-State Track (@KStateTFXC) May 15, 2021
🛸 🌎 ° 🌓 • .°• 🚀 ✯ @TejaswinShankar
★ * ° 🛰 °· 🪐
. • ° ★ • ☄ pic.twitter.com/atTexyXRCI
Comments
Please login to add a commentAdd a comment