Paris Paralympics 2024: భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణం | Paris Paralympics 2024: Kumar Nitesh Wins Gold Medal In Men's Singles SL3 Badminton | Sakshi
Sakshi News home page

Paris Paralympics 2024: భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణం

Published Mon, Sep 2 2024 5:17 PM | Last Updated on Mon, Sep 2 2024 6:18 PM

Paris Paralympics 2024: Kumar Nitesh Wins Gold Medal In Men's Singles SL3 Badminton

పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఎప్‌ఎల్‌-3 ఈవెంట్‌లో నితేశ్‌ కుమార్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఇవాళ (సెప్టెంబర్‌ 2) జరిగిన ఫైనల్లో నితేశ్‌.. గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన డేనియల్‌ బేతెల్‌పై 21-14, 18-21, 23-21 తేడాతో విజయం సాధించాడు. 

ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇది తొమ్మిదో పతకం. ఈ రోజే పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌ 56 కేటగిరీలో యోగేశ్‌ కథూనియా రజత పతకం సాధించాడు. ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్‌ 2 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు సాధించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement