
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో ట్యునీషియాకు చెందిన రౌవా తిలీ అదగొడుతున్నారు. షాట్‌పుట్ ఎఫ్41 విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. వరుసగా ఐదో పారాలింపిక్స్‌లో ఆమె పసిడి పతకం గెలవడం విశేషం. ఓవరాల్‌గా ఆమెకు ఇది ఏడో ఒలింపిక్ స్వర్ణం.
దీంతో పాటు మరో 2 రజతాలు కూడా ఆమె సాధించింది. 2008లో డిస్కస్ త్రోలో స్వర్ణం సాధించిన రౌవా, 2012లో షాట్‌పుట్‌లో బంగారు పతకాన్ని అందుకుంది. ఆ తర్వాత 2016, 2020లలో అటు షాట్‌పుట్‌లో, ఇటు డిస్కస్‌లో రెండేసి స్వర్ణాల చొప్పున నెగ్గింది. కాగా 34 ఏళ్ల తిలీ ఎత్తు 4.4 అడుగులే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment