క్రికెట్ వరల్డ్‌కప్‌లో గోల్డ్ మెడల్స్ ఇవ్వడం ఎప్పటినుంచి మొదలుపెట్టారని అనుకుంటున్నారా..? ఈ స్టోరీపై ఓ లుక్కేయండి మీకే అర్థమవుతుంది. ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి బెస్ట్ ఫీల్డర్ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ ఇవ్వాలని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ భావించాడు. ఈ అవార్డు రేసులో శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి పోటాపోటీ పడ్డారు. అయితే అంతిమంగా అవార్డు కోహ్లిని వరించింది.
📽️ BTS from the #TeamIndia 🇮🇳 dressing room 😃👌 - By @28anand
— BCCI (@BCCI) October 9, 2023
A kind of first 🥇 #CWC23 | #INDvAUS
And the best fielder of the match award goes to....🥁
WATCH 🎥🔽https://t.co/wto4ehHskB
మిచెల్ మార్ష్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో పాటు ఫీల్డ్‌లో పాదరసంలా కదులుతూ, సహచరుల్లో స్పూర్తి నింపినందుకు గాను కోహ్లిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు దిలీప్ తెలిపాడు. ఆసీస్‌పై విక్టరీ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో సెలబ్రేషన్స్ సందర్భంగా దిలీప్.. కోహ్లిని బెస్ట్ ఫీల్డర్‌గా అనౌన్స్ చేస్తూ గోల్డ్ మెడల్‌ను అందించాడు. ఈ అవార్డు రేసులో శ్రేయస్ అయ్యర్ కూడా పోటీపడ్డాడని దిలీప్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అద్భుతమైన డైవ్ చేసాడని ప్రశంసించాడు.
కేవలం ఒక్క క్యాచ్ కారణంగానే కోహ్లికి ఈ అవార్డు ఇవ్వలేదని వివరణ ఇచ్చాడు. దిలీప్ అవార్డు బహుకరిస్తుండగా.. కోహ్లి మెడలో వేయాలని కోరాడు. దీంతో దిలీప్ గోల్డ్ మెడల్‌ను కోహ్లి మెడలో వేశాడు. అనంతరం కోహ్లి మెడల్‌ను నోటితో కొరకుతూ సరదాగా ఫోటోలకు పోజులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం వైరలవుతుంది.
కాగా, ఆసీస్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. బుమ్రా (10-0-35-2), రవీంద్ర జడేజా (10-2-28-3), కుల్దీప్ యాదవ్ (10-0-42-2), అశ్విన్ (10-1-34-1), సిరాజ్ (6.3-1-26-1), హార్దిక్ (3-0-28-1) ధాటికి 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ కాగా.. కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు), రాహుల్ (115 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు)ల చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ల సాయంతో భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment