ఇంటర్ననేషనల్ మార్షల్ ఆర్ట్స్‌లో తెలుగు తేజం, విశాఖకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ సత్తాచాటాడు. కెనడా వేదికగా జరిగిన ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్‌లో అన్మిష్ వర్మ గోల్డ్‌మెడల్‌తో మెరిశాడు. మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరపున 75 కిలోల విభాగంలో ఆన్మిష్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.
ఈ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో అన్మిష్‌కు ఇది వరుసగా మూడో బంగారు పతకం కావడం విశేషం. తద్వారా ఓ అరుదైన ఘనతను అన్మిష్ తన పేరిట లిఖించుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా అన్మిష్ రికార్డులకెక్కాడు. అంతకుముందు 2018లో గ్రీస్ వేదికగా జరిగిన మార్షల్ ఆర్ట్స్‌లో పసిడి పతకం సొంతం చేసుకున్న అన్మిష్.. 2019లో ఆస్ట్రియా లో జరిగిన ఈవెంట్‌లోనూ బంగారు పతకంతో మెరిశాడు.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్ క్లాస్: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment