martal arts
-
అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన తెలుగు తేజం.. మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్‌మెడల్
ఇంటర్ననేషనల్ మార్షల్ ఆర్ట్స్‌లో తెలుగు తేజం, విశాఖకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ సత్తాచాటాడు. కెనడా వేదికగా జరిగిన ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్లో అన్మిష్ వర్మ గోల్డ్‌మెడల్‌తో మెరిశాడు. మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరపున 75 కిలోల విభాగంలో ఆన్మిష్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఈ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో అన్మిష్‌కు ఇది వరుసగా మూడో బంగారు పతకం కావడం విశేషం. తద్వారా ఓ అరుదైన ఘనతను అన్మిష్ తన పేరిట లిఖించుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా అన్మిష్ రికార్డులకెక్కాడు. అంతకుముందు 2018లో గ్రీస్ వేదికగా జరిగిన మార్షల్ ఆర్ట్స్‌లో పసిడి పతకం సొంతం చేసుకున్న అన్మిష్.. 2019లో ఆస్ట్రియా లో జరిగిన ఈవెంట్లోనూ బంగారు పతకంతో మెరిశాడు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్ క్లాస్: రోహిత్ శర్మ -
‘మార్షల్ ఆర్ట్స్’లో శిక్షణ
ఏలూరు సిటీ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి బాలికలకు ఆత్మ రక్షణార్థం వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్‌లో(కరాటే, కుంగ్‌ఫూ, కిక్ బాక్సింగ్, జూడో, తైక్వాండో) శిక్షణ ఇప్పించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు బుధవారం తెలిపారు. ఈ మేరకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు శిక్షణ సంస్థలు, బోధనా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తులను నిర్ణీత ఫార్మాట్లో ఈ నెల 20వ తేదీలోగా డైరెక్టర్, ఆర్‌ఎంఎస్‌ఏ, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన, సైఫాబాద్, హైదరాబాద్ అడ్రసుకు సమర్పించాలని కోరారు. వివరాలకు 040–23232220లో సంప్రదించాలని సూచించారు