దివ్యాకృతి సింగ్, అనూష్, హృదయ్, సుదీప్తిలతో కూడిన ఇండియన్ టీమ్ ఈక్వెస్ట్రియన్ డ్రస్సెజ్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఈ బృందంలో ఒకరైన దివ్యాకృతిసింగ్‌కు తండ్రి విక్రమ్ రాథోడ్ అన్నిరకాలుగా అండగా నిలిచాడు. ఆమె ట్రైనింగ్ కోసం ఇంటిని కూడా అమ్మాడు. ఈ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
దిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాలేజీలో చదువుకునే రోజుల్లో పోటీ పడేందుకు గుర్రం లేకపోవడంతో రెండు సంవత్సరాలు పోటీకి దూరంగా ఉంది దివ్యాకృతి. ఆసియా క్రీడల్లో పాల్గొనాలనే కూతురు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని జర్మనీలో గుర్రాన్ని కొన్నాడు. గుర్రం కొనడం నుంచి స్పాన్సరర్‌ల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం వరకు విక్రమ్ రాథోడ్ పడని కష్టం లేదు. ఏమైతేనేం, ఆయన శ్రమ ఫలించింది. కుమార్తె బంగారు కల నెరవేరింది.
Comments
Please login to add a commentAdd a comment