![Gold for Vinesh Phogat](/styles/webp/s3/article_images/2024/07/7/phoghat.jpg.webp?itok=tEwXiJJP)
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్‌కు ముందు కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. మాడ్రిడ్‌లో జరిగిన స్పెయిన్ గ్రాండ్ ప్రిలో వినేశ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 50 కేజీల కేటగిరీ ఫైనల్లో వినేశ్ 10–5 స్కోరుతో మారియా తియుమెరికొవాపై విజయం సాధించింది.
రష్యాకు చెందిన మారియా తటస్థ అథ్లెట్‌గా బరిలోకి దిగింది. ఫైనల్‌కు ముందు వినేశ్ సంపూర్ణ ఆధిపత్యంతో వరుసగా మూడు బౌట్‌లలో గెలుపొందింది. యుజ్‌నీలిస్ గజ్‌మన్ (క్యూబా)పై 12–4తో, ఆ తర్వాత మాడిసన్ పార్క్స్ (కెనడా)పై ‘విన్ బై ఫాల్’తో, సెమీ ఫైనల్లో కేటీ డచక్ (కెనడా)పై 9–4తో వినేశ్ గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment