
మాంట్రియల్: ఓ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొన్న 18 ఏళ్ల టీనేజ్ అమ్మాయి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. మాంట్రియల్‌లో జరిగిన జీవైఎం గాలా ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఈవెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మెక్సికోకు చెందిన వెల్టర్‌వెయిట్ బాక్సర్ జెన్నెట్ జకారియాస్ జపాటా గత శనివారం షెడ్యూలైన ఆరు రౌండ్ల బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొంది. మూడు రౌండ్ల వరకు ఈ ఫైట్ సజావుగా సాగింది. అయితే, నాలుగో రౌండ్‌లో ప్రత్యర్థి మేరీ పియర్ హౌల్ విసిరిన పంచ్‌లకు జెన్నెట్ నేలకూలింది. ఐదో రౌండ్ బెల్ మోగాక కూడా ఆమె తేరుకోకపోవడంతో స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. మెదడులో తీవ్ర రక్తస్రావం కావడంతో ఐదు రోజులు మృత్యువుతో పోరాడిని అనంతరం గురువారం ఆమె కన్నుమూసినట్లు ఫైట్ నిర్వాహకులు వెల్లడించారు.
చదవండి: ఢిల్లీ పగ్గాలు పంత్‌కే.. శ్రేయస్‌కు భంగపాటు
Comments
Please login to add a commentAdd a comment