mexican boxer
-
బాక్సింగ్ రింగ్‌లో విషాదం.. 18 ఏళ్ల టీనేజ్ బాక్సర్ మృతి
మాంట్రియల్: ఓ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొన్న 18 ఏళ్ల టీనేజ్ అమ్మాయి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. మాంట్రియల్లో జరిగిన జీవైఎం గాలా ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఈవెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మెక్సికోకు చెందిన వెల్టర్‌వెయిట్ బాక్సర్ జెన్నెట్ జకారియాస్ జపాటా గత శనివారం షెడ్యూలైన ఆరు రౌండ్ల బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొంది. మూడు రౌండ్ల వరకు ఈ ఫైట్ సజావుగా సాగింది. అయితే, నాలుగో రౌండ్లో ప్రత్యర్థి మేరీ పియర్ హౌల్ విసిరిన పంచ్‌లకు జెన్నెట్ నేలకూలింది. ఐదో రౌండ్ బెల్ మోగాక కూడా ఆమె తేరుకోకపోవడంతో స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. మెదడులో తీవ్ర రక్తస్రావం కావడంతో ఐదు రోజులు మృత్యువుతో పోరాడిని అనంతరం గురువారం ఆమె కన్నుమూసినట్లు ఫైట్ నిర్వాహకులు వెల్లడించారు. చదవండి: ఢిల్లీ పగ్గాలు పంత్‌కే.. శ్రేయస్‌కు భంగపాటు -
అమీర్ ఖాన్‌కు నాకౌట్ పంచ్!
లాస్‌వెగాస్: బ్రిటన్ బాక్సర్ అమీర్ ఖాన్.. మెక్సికన్ ప్రొఫెషనల్ బాక్సర్ సాల్ కానెలో అల్వరేజ్ చేతిలో నాకౌట్ ఓటమి చవిచూశాడు. ఆరు రౌండ్ల పోరులో అమీర్ ఖాన్ ఆది నుంచీ దూకుడును ప్రదర్శించినా చివరి రౌండ్లో క్షణకాలం పాటు కోల్పోయిన ఏకాగ్రత మూలంగా భారీ మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో మిడిల్ వెయిట్ విభాగంలో వరల్డ్ ఛాంపియన్ షిప్‌ను సాల్ కానెలో నిలుపుకున్నడు. బాక్సింగ్ రింగ్‌లో మొదటి రౌండ్ నుంచి చురుగ్గా కదిలిన అమీర్ ఖాన్ మెరుపులాంటి పంచ్‌లతో ఆకట్టుకున్నాడు. మూడు, నాలుగో రౌండ్లలో అల్వరేజ్పై పంచ్‌ల వర్షం కురిపించాడు. అయితే ఐదో రౌండ్‌కు వచ్చే సరికి అల్వరేజ్ చెలరేగి తన ఛాంపియన్ గేమ్‌ను అమీర్‌కు రుచిచూపించాడు. చివరి రౌండ్లో అదే జోరును కొనసాగిస్తూ.. మెరుపులాంటి రైట్ హ్యాండ్‌తో దాడి చేయడంతో అమీర్ ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో మరో 23 సెకన్ల సమయం ఉందనగా మ్యాచ్ ముగిసింది. మ్యాచ్ అనంతరం అల్వరేజ్ 'మాన్స్టర్ పంచ్'కు అభినందనలు తెలుపుతూ అమీర్ ట్వీట్ చేశాడు.