ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్, న్యూ సౌత్‌వేల్స్ దిగ్గజం ఫ్రాంక్ మిస్సన్ (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఫ్రాంక్ మిస్సన్ శుక్రవారం తన సృగృహంలో తుది శ్వాస విడిచారు.
ఈ విషయాన్ని న్యూ సౌత్‌వేల్స్ క్రికెట్ ధ్రువీకరించింది. కాగా 1960 నుంచి 1961 మధ్య ఆసీస్ తరపున కేవలం ఐదు టెస్టులు మ్యాచ్‌లు ఆడిన మిస్సన్.. 16 వికెట్లు పడగొట్టారు. వెస్టిండీస్‌తో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో 4 వికెట్లు పడగొట్టి సత్తచాటారు.
అయితే గాయం కారణం ఆయన కెరీర్‌లో మధ్యలోనే ముగిసిపోయింది. కానీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం మిస్సన్ మాత్రం అద్బుతమైన గణాంకాలను ఆయన నమోదు చేశారు. న్యూసౌత్‌వేల్స్ తరపున 71 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఫ్రాంక్ మిస్సన్ 177 వికెట్లు సాధించారు.
కాగా మిస్సన్ క్రికెటర్ కాకముందు మంచి అథ్లెట్ కూడా. మిడిల్ డిస్టెన్స్ మాజీ కోచ్ పెర్సీ సెరుట్టితో మిస్సన్ శిక్షణ పొందాడు. ఆ తర్వాత చాలా మంది అథ్లెట్లకు కోచ్‌గా ఆయన పనిచేశారు. ఆస్ట్రేలియాకు చెందిన హెర్బ్ ఇలియట్‌కు శిక్షణనిచ్చి 1960లో రోమ్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ల స్వర్ణం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన మృతి పట్ల పలువరు న్యూసౌత్‌వేల్స్ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.
చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment