క్వార్టర్స్‌లో బాక్సర్ నిహారిక
ఇస్తాంబుల్ (టర్కీ): అహ్మద్ కామెర్ట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి గోనెళ్ల నిహారిక శుభారంభం చేసింది. బుధవారం జరిగిన జూనియర్ మహిళల 75 కేజీల విభాగం తొలి రౌండ్‌లో లౌరా మమెద్‌కులియెవా (రష్యా)పై నిహారిక గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 57 కేజీల విభాగంలో ఓల్గా వాజ్‌నియాక్ (ఉక్రెయిన్)పై శశి చోప్రా నెగ్గగా... 51 కేజీల విభాగంలో జాన్‌సాయా అబోరైమోవా (కజకిస్తాన్) చేతిలో దీపా కుమారి ఓడిపోయింది.
టర్కీ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వరంలో ప్రతి ఏడాదీ జరిగే ఈ టోర్నీలో వివిధ దేశాల అగ్రశ్రేణి బాక్సర్లు పాల్గొంటారు. ఈసారి ఆతిథ్య టర్కీతోపాటు భారత్, రష్యా, కజకిస్తాన్, టర్కీ, మంగోలియా, థాయ్‌లాండ్, ఉక్రెయిన్, తజికిస్తాన్, అర్మేనియా, బల్గేరియా, ఆస్ట్రేలియాల నుంచి 90 మంది మహిళా బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.