న్యూఢిల్లీ: స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. బల్గేరియా రాజధాని సోఫియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో మహిళల 51 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ 5–0తో యాస్మీన్ ముతాకి (మొరాకో)పై ఘనవిజయం సాధించింది. ఇదే టోర్నీలో పురుషుల 63 కేజీల విభాగంలో భారత బాక్సర్ శివ థాపాకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. మరోవైపు సెర్బియాలో ముగిసిన నేషన్స్ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోరీ్నలో భారత్‌కు నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి. మీనా కుమారి (54 కేజీలు), రితూ గ్రెవాల్ (51 కేజీలు), మోనిక (48 కేజీలు), భాగ్యబతి (75 కేజీలు) ఫైనల్లో ఓడి రజతాలు నెగ్గగా... సెమీస్‌లో ఓడిన బసుమతారి (64 కేజీలు), పవిత్ర (60 కేజీలు) కాంస్యాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment