
స్టావెంగర్: నార్వే చెస్ టోర్నమెంట్‌లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశాడు. బుధవారం రాత్రి జరిగిన క్లాసికల్ విభాగం రెండో రౌండ్‌లో ఆనంద్ 36 ఎత్తుల్లోనే బల్గేరియాకు చెందిన వసెలిన్ తొపలోవ్‌పై విజయం సాధించాడు. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 52 ఏళ్ల ఆనంద్ 10 మంది పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం 6 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. మరో పోరులో మాగ్నస్ కార్ల్‌సన్‌ను అమెరికాకు చెందిన వెస్లీ సో చిత్తు చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన గేమ్ 38 ఎత్తుల్లో డ్రాగా ముగియగా ‘సడెన్ డెత్’లో వెస్లీకి విజయం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment