viswanathan anandh
-
Norway chess: ఆనంద్‌కు మరో విజయం
స్టావెంగర్: నార్వే చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశాడు. బుధవారం రాత్రి జరిగిన క్లాసికల్ విభాగం రెండో రౌండ్లో ఆనంద్ 36 ఎత్తుల్లోనే బల్గేరియాకు చెందిన వసెలిన్ తొపలోవ్‌పై విజయం సాధించాడు. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 52 ఏళ్ల ఆనంద్ 10 మంది పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం 6 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. మరో పోరులో మాగ్నస్ కార్ల్‌సన్‌ను అమెరికాకు చెందిన వెస్లీ సో చిత్తు చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన గేమ్ 38 ఎత్తుల్లో డ్రాగా ముగియగా ‘సడెన్ డెత్’లో వెస్లీకి విజయం లభించింది. -
ఆఖరి స్థానంలో ఆనంద్
సెయింట్ లూయిస్: ప్రపంచ మాజీ చాంపియన్, భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో నిరాశ ఎదురైంది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో ఆనంద్ 13.5 పాయింట్లు సాధించాడు. పది మంది పాల్గొన్న ఈ టోర్నీలో పదో స్థానంలో నిలిచాడు. తొలి రౌండ్లో అమెరికాకు చెందిన హికరు నకమురపై గెలిచిన అనంతరం ఆనంద్ మరో గెలుపును అందుకోలేకపోయాడు. అయితే నకముర (22.5) టోర్నీ విజేతగా నిలవడం విశేషం. -
ఏడో గేమ్‌లో డ్రాతో సరిపెట్టుకున్నఆనంద్
చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన ఏడో గేమ్ ను డ్రాతో సరిపెట్టుకున్నాడు. చివరి మ్యాచ్‌లోనైనా విజయం సాధిస్తాడని భావించిన సగటు ప్రేక్షకుడికి మాత్రం ఆనంద్ నిరాశనే మిగిల్చాడు. ఏడో గేమ్‌లో తెల్ల పావులతో మాగ్నస్ కార్ల్సెన్ పోటీపడిన ఈ భారత యోధుడు ఎఫెన్స్ తో ఆటను ఆరంభించాడు. కాగా వరుస రెండు మ్యాచ్ లో విజయం సాధించిన కార్ల్సెన్ దూకుడుగానే ఆడటంతో ఆనంద్ కాస్త నెమ్మదించాడు. చివరకు ఇరువురూ డ్రాకు అంగీకరించారు. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం జరిగిన ఈ పోరు పెద్దగా ఆసక్తిని కనబరచలేదు. మరో ఐదు గేమ్‌లు మిగిలి ఉన్న ఈ పోటీలో కార్ల్సెన్ రెండు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించి తొలిసారి విశ్వవిజేత అయ్యేందుకు పటిష్ట పునాదిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్ల్సెన్ 2-5 ఆధిక్యంలోకి దూసుకువెళ్లాడు. -
ఆనంద్ అద్భుతం చేస్తాడా?
చెన్నై: సొంతగడ్డపై పరాభవం తప్పించుకోవాలంటే భారత గ్రాండ్‌మాస్టర్, డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తన అనుభవాన్నంతా రంగరించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌తో జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీలో ప్రస్తుతం ఆనంద్ 2-4 పాయింట్ల తేడాతో వెనుకంజలో ఉన్నాడు. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం జరిగే ఏడో గేమ్‌లో ఆనంద్ తెల్ల పావులతో పోటీపడనున్నాడు. ఐదో గేమ్‌లో నల్ల పావులతో, ఆరో గేమ్‌లో తెల్ల పావులతో ఓటమి చవిచూసిన ఆనంద్ టైటిల్ రేసులో నిలవాలంటే తదుపరి గేముల్లో అద్వితీయ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. మరో ఆరు గేమ్‌లు మిగిలి ఉన్న ఈ పోటీలో కార్ల్సెన్ రెండు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించి తొలిసారి విశ్వవిజేత అయ్యేందుకు పటిష్ట పునాదిని నిర్మించుకున్నాడు. పోటీ ఆరంభం ముందే చెస్ పండితులు 22 ఏళ్ల కార్ల్సెన్ను ఫేవరెట్‌గా పరిగణించారు. అయితే 43 ఏళ్ల ఆనంద్ ఇంత తొందరగా కార్ల్సెన్ వ్యూహంలో పడిపోతాడని ఎవరూ ఊహించలేదు. ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్ వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న తీరు అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిగ్రహంతో ఉండే ఆనంద్ శనివారం ఆరో గేమ్ పూర్తయ్యాక నిర్వహించిన మీడియా సమావేశంలో కొన్ని ప్రశ్నలకు అసహనం వ్యక్తం చేశాడు. ‘ఈ పరాజయం పెద్ద దెబ్బ. దీనిని ఊహించలేదు. అయినా నా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాను’ అని నార్వే జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానాన్ని లోతుగా విశ్లేషించాలని ఆ జర్నలిస్ట్ కోరగా... ఆనంద్ సహనం కోల్పోయాడు. ‘అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానంటే దాని అర్థం అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానంతే. మీరు ఇంగ్లిష్‌ను ఎందుకు అర్థం చేసుకోరో నాకు తెలియడంలేదు’ అని ఆనంద్ ఆగ్రహంతో జవాబు ఇచ్చాడు. రెండు పాయింట్లతో వెనుకంజలో ఉన్నా ఆనంద్ అవకాశాలను పూర్తిగా తీసిపారేయలేం. ఈ ఆరు గేముల్లో ఆనంద్‌కు మూడుసార్లు తెల్ల పావులతో ఆడే అవకాశం లభిస్తుంది. సోమవారం జరిగే ఏడో గేమ్‌లో ఆనంద్ గెలిస్తే ఏదైనా జరగొచ్చు. అయితే కార్ల్సెన్ ఆటతీరుపై అవగాహన ఉన్నవారు మాత్రం ఆనంద్ కోలుకోవడం కష్టమేనని అంటున్నారు. గేమ్‌ను సుదీర్ఘంగా సాగదీయడం... ప్రత్యర్థి అలసిపోయేలా చేయడం... ఆ తర్వాత అంతుచిక్కని వ్యూహాలతో ప్రత్యర్థులే పొరపాట్లు చేసే విధంగా పరిస్థితులు సృష్టించడం.. దాని ద్వారా గేమ్‌ను శాసించేస్థితిలోకి తెచ్చుకోవడం కార్ల్సెన్ శైలి. ఆనంద్‌పై ఇవే పద్ధతులను ప్రయోగించి గత రెండు గేముల్లో కార్ల్సెన్ సత్ఫలితాలు సాధించాడు. ఇకనైనా ఆనంద్ తేరుకొని కొత్త వ్యూహా లతో ప్రత్యర్థికి చెక్ పెడతాడో లేక చేతులెత్తేస్తాడో వేచి చూడాలి.