ఏడో గేమ్లో డ్రాతో సరిపెట్టుకున్నఆనంద్ | Viswanathan Anand draws seventh game against Magnus Carlsen | Sakshi
Sakshi News home page

ఏడో గేమ్లో డ్రాతో సరిపెట్టుకున్నఆనంద్

Published Mon, Nov 18 2013 6:38 PM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM

Viswanathan Anand draws seventh game against Magnus Carlsen

చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన ఏడో గేమ్ ను డ్రాతో సరిపెట్టుకున్నాడు. చివరి మ్యాచ్లోనైనా విజయం సాధిస్తాడని భావించిన సగటు ప్రేక్షకుడికి మాత్రం ఆనంద్ నిరాశనే మిగిల్చాడు. ఏడో గేమ్‌లో తెల్ల పావులతో మాగ్నస్ కార్ల్‌సెన్‌ పోటీపడిన ఈ భారత యోధుడు ఎఫెన్స్ తో ఆటను ఆరంభించాడు. కాగా  వరుస రెండు మ్యాచ్ లో విజయం సాధించిన కార్ల్సెన్ దూకుడుగానే ఆడటంతో ఆనంద్ కాస్త నెమ్మదించాడు. చివరకు ఇరువురూ డ్రాకు అంగీకరించారు.

 

ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం జరిగిన ఈ పోరు పెద్దగా ఆసక్తిని కనబరచలేదు. మరో ఐదు గేమ్‌లు మిగిలి ఉన్న ఈ పోటీలో కార్ల్‌సెన్ రెండు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించి తొలిసారి విశ్వవిజేత అయ్యేందుకు పటిష్ట పునాదిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్ల్సెన్ 2-5 ఆధిక్యంలోకి దూసుకువెళ్లాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement