భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మరోసారి ఓటమి పాలైయ్యాడు.
చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మరోసారి ఓటమి పాలైయ్యాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ లో భాగంగా శనివారం మాగ్నస్ కార్ల్‌సెన్ తో జరిగిన మ్యాచ్లో ఆనంద్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్నాడు. ఫలితంగా టోర్నీలో క్లార్సెన్ 4-2
ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. తనదైన ఆటతీరతో ఆకట్టకున్న నార్వే గ్రాండ్ మాస్టర్ విజయపరంపర కొనసాగిస్తూ ఆనంద్కు ఆశలపై నీళ్లు చల్లాడు. ఇప్పటికి ఆరు మ్యాచ్ ల్లో నాలుగు గేమ్లు డ్రాగా ముగిసాయి. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండటంతో ఆనంద్ విజయం సాధించినా చాంపియన్షిప్ ట్రోఫీని క్లార్సెన్కు అప్పగించక తప్పదు. శుక్రవారం జరిగిన ఐదో గేమ్‌లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్ 58 ఎత్తుల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.