
దుబాయ్: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ జోరు మీదున్నాడు. చాలెంజర్ నిపోమ్‌నిషి (రష్యా)తో మంగళవారం జరిగిన తొమ్మిదో గేమ్‌లో కార్ల్‌సన్ నల్లపావులతో ఆడుతూ 39 ఎత్తుల్లో గెలిచాడు. ఈ చాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్‌కిది మూడో విజయం. గత రెండు విజయాలు కార్ల్‌సన్‌కు తెల్లపావులతో ఆడినపుడు లభించాయి. తొమ్మిదో గేమ్‌ను ప్రారంభించే అవకాశం భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు దక్కింది. నిపోమ్‌నిషి తరఫున ప్రజ్ఞానంద తెల్లపావులతో తొలి ఎత్తును వేసి గేమ్‌ను ప్రారంభించాడు. మొత్తం 14 గేమ్‌లు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో తొమ్మి ది గేమ్‌ల తర్వాత కార్ల్‌సన్ 6–3తో ఆధిక్యంలో ఉన్నాడు. నేడు పదో గేమ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment