![Viswanathan Anand finishes ninth in St. Louis Rapid - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/17/anand.jpg.webp?itok=d-PrCu33)
సెయింట్ లూయిస్: ప్రపంచ మాజీ చాంపియన్, భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌లో నిరాశ ఎదురైంది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో ఆనంద్ 13.5 పాయింట్లు సాధించాడు. పది మంది పాల్గొన్న ఈ టోర్నీలో పదో స్థానంలో నిలిచాడు. తొలి రౌండ్‌లో అమెరికాకు చెందిన హికరు నకమురపై గెలిచిన అనంతరం ఆనంద్ మరో గెలుపును అందుకోలేకపోయాడు. అయితే నకముర (22.5) టోర్నీ విజేతగా నిలవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment