విమానానికి బాంబు బెదిరింపు
సోఫియా: బాంబు బెదిరింపుతో పోలాండ్-ఈజిప్టు విమానం అత్యవసరంగా కిందకు దిగింది. బల్గేరియా రాజధాని సోఫియాలో ల్యాండ్ అయింది. విమానంలో బాంబు పెట్టినట్టు 64 ఏళ్ల ప్రయాణికుడు సమాచారం అందించాడని, అతడిని భద్రతా అధికారులు ప్రశ్నిస్తున్నారని బల్గేరియా మీడియా తెలిపినట్టు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. విమానం నుంచి ప్రయాణికులను దించేసి, సోదాలు చేపట్టారు. వార్సా నుంచి ఈజిప్టులోని రిస్టార్ట్ నగరం హర్గదాకు విమానం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
గత నెల 31న ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో కూలిన రష్యా విమానాన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బాంబుతో పేల్చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలాండ్-ఈజిప్టు విమానానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళన వ్యక్తమవుతోంది.