అయ్యో ఆలియా! | Alia Bhatt injured on sets of Brahmastra in Bulgaria while shooting | Sakshi
Sakshi News home page

అయ్యో ఆలియా!

Published Wed, Mar 21 2018 12:24 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Alia Bhatt injured on sets of Brahmastra in Bulgaria while shooting - Sakshi

ఆలియా భట్‌

వారం రోజులు కూడా కంప్లీట్‌ కాలేదు. కథానాయిక ఆలియా భట్‌ బర్త్‌డేని హ్యాపీగా స్పెండ్‌ చేసి, ఈ నెల 15న 25వ వసంతంలోకి అడుగుపెట్టారామె. పాతికేళ్లల్లోకి ఎంటరైన సందర్భంగా ఫుల్‌గా పార్టీ చేసుకున్నారు. ఒక గుడ్‌ తర్వాత ఒక బ్యాడ్‌ అన్నట్లు.. వారం తిరగకుండానే ఆలియాకి చేదు అనుభవం ఎదురైంది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్‌లో ఆలియా గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన ఆలియా అభిమానులు.. ‘అయ్యో ఆలియా. ఇలా జరగకుండా ఉండాల్సింది’ అంటున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్, అమితాబ్‌ బచ్చన్, ఆలియా భట్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్‌ బల్గేరియాలో జరుగుతోంది.

ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేస్తున్న సమయంలో కాస్త బ్యాలెన్స్‌ తప్పి ఆలియా భట్‌ గాయపడ్డారు. దీంతో ఆమె 15 రోజుల పాటు షూట్‌కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటారని బాలీవుడ్‌ టాక్‌. ‘‘ఆలియా కుడిచేతికి దెబ్బ కాస్త బలంగానే తగిలింది. ఈ మంత్‌ ఎండింగ్‌ కల్లా బల్గేరియా షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేయాలని ‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌ ప్లాన్‌ చేశారు. ఇంతలో ఇలా జరిగింది. ఇప్పుడు ఇతర సీన్స్‌పై చిత్రబృందం దృష్టి సారించింది’’ అని యూనిట్‌ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement