
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఇన్‌స్పెక్టర్ అవినాష్ షూటింగ్ సమయంలో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడిపోయాడు. దీంతో వెంటనే అతన్ని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతానికి అతనికి పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. నటుడి ఎడమ కాలికి గాయం కావడంతో దీనికి శస్త్రచికిత్స చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ సల్మాన్ ఖాన్‌తో రాధే సినిమా కోసం యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు రణదీప్ గాయపడ్డాడు. అప్పుడు ఆయన కుడి కాలుకు మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది.
రణదీప్ నటించనున్న ప్రాజెక్ట్‌లు
రణ్‌దీప్ నటించబోయే వీర్ సావర్కర్ తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉంది. తన రాబోయే చిత్రంలోని సావర్కర్ పాత్ర కోసం రణ్‌దీప్ హుడా చాలా బరువు తగ్గాడు. వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్రకు సరిపోయేలా కఠినమైన డైట్‌ని పాటిస్తూ 22 కిలోల బరువు తగ్గారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున ఇప్పటికీ వరకు షెడ్యూల్ ప్రకటించలేదు. చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ సిరీస్ క్యాట్‌లో కనిపించాడు. ఆ తర్వాత తేరా క్యా హోగా లవ్లీలో ఇలియానా డి'క్రూజ్‌తో కలిసి కనిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment