బల్గేరియా | The topography of Bulgaria | Sakshi
Sakshi News home page

బల్గేరియా

Published Sat, Feb 21 2015 11:21 PM | Last Updated on Sat, Aug 11 2018 7:28 PM

బల్గేరియా - Sakshi

బల్గేరియా

నైసర్గిక స్వరూపం
 
వైశాల్యం: 110,994 చ.కి.మీ.
జనాభా: 7,364,570 (తాజా అంచనాల ప్రకారం)
రాజధాని: సోఫియా
ప్రభుత్వం: యూనిటరీ పార్లమెంటరీ రిపబ్లిక్
కరెన్సీ: బల్గేరియాన్ లెవ్
అధికార భాష: బల్గేరియాన్
జాతులు: 84% బల్గేరియన్‌లు, 9% టర్కీలు,
5% రోమన్‌లు, 2% ఇతరులు
సరిహద్దులు: ఉత్తరాన  రోమేనియా, పశ్చిమాన సెర్బియా, మెసిడోనియా, దక్షిణాన గ్రీకు, టర్కీ  దేశాలు, తూర్పున నల్ల సముద్రం ఉన్నాయి.

 నాగరికత: బల్గేరియా నగరికత చాలా ప్రాచీనమైనది. అనేక భిన్న సంసృ్కతుల కలయిక.  ధ్రేసియన్‌లు, పురాతన గ్రీకులు, రోమన్లు, స్లావ్స్‌ల తమ సంస్కృతుల చిహ్నాలను బల్గేరియా నాగరితపై వదిలారు. దీనివల్ల బల్గేరియా దేశం ప్రపంచంలో ధనిక జానపద వారసత్వంగా రూపుదిద్దుకుంది. జెరెజన్, కుకెరి, మార్టెనిజా వంటి థ్రేసియన్ ఆచారాలు ఆధునిక బల్గేరియా సంస్కృతిని సజీవంగా ఉంచా యి.

 పరిశ్రమలు: రెండవ ప్రపంచ యుద్ధం ముందుగా బల్గేరియా ఆర్థికస్థితి ప్రధానంగా ఆహారం, వస్త్ర ఉత్పత్తులు వంటి లఘు పరిశ్రమలు మరియు వ్యవసాయంపై ఆధారపడి ఉండేది. సామ్యవాద శకంలో పారిశ్రామీకరణ వల్ల భారీ పరిశ్రమలు లోహయంత్రాల ఉత్పత్తి, చమురు శుద్ధి కర్మాగారాలు, రసాయనాలు, నూనెశుద్ధి కర్మాగారాలు మొదలైన వాటి వల్ల 20 శతాబ్దం చివరలో బల్గేరియా ఆధిపత్యం కొనసాగింది.

 ఆహారం: బల్గేరియాలో గ్రీస్, టర్కీలలో ఉండే ఆహారం మాదిరిగా అనేక విధాలుగా ఉంటుంది. సాంప్రదాయ ఆహారం టమాటా, దోసకాయ, జున్ను, ముసాకా, రొట్టె, సగ్గుబియ్యం, వైన్ లీవ్స్ మొదలైనవి. బల్గేరియన్ వాసుల ముఖ్యమైన సంప్రదాయ వంటకాల్లో ఎక్కువగా పెరుగు, జున్ను, ద్రవ్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తీసుకుంటారు.
 
 చరిత్ర

బల్గేరియా  అధికారక నామం ‘‘రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా’’  ఐరోపా ఖండంలోని ఒక బల్గన్ దేశం. ఇది ఎంతో అందమైన, మనోహరమైన దేశం. దీనిని ‘‘గులాబీల భూమి’’ అని కూడా పిలుస్తారు. అరుదైన గులాబీ రకం ‘రోసా దమస్కేన్’ అనే  మొక్క నుండి తీసే గులాబీ నూనె బల్గేరియాలోనే తయారవుతుంది. ఈ నూనెను ప్రపంచవ్యాప్తంగా సౌందర్య మూలకాలు, సువాసన ద్రవ్యాలలో ఉపయోగిస్తారు.
 ఓర్పియాస్ స్పార్టకస్‌కు జన్మనిచ్చిన భూమి బల్గేరియా. సుదీర్ఘమైన చరిత్ర కలిగి గ్రీకులు, స్కైతియన్లు, రోమన్లు, బైజాంటైన్, టర్కీలతో జయించి రూపుదిద్దుకుంది. బల్గేరియా మధ్యయుగాన్ని యూరోప్‌ని బల్గర్ నవాబులు పాలించిన కాలంలో ‘గోల్డెన్ యేజ్’గా పిలుస్తారు. తరువాత 500 సంవత్సరాల తరువాత క్రూరమైన టర్కిష్ ఆధిపత్యం మిగతా యూరోప్ దేశాల నుండి విముక్తిని పొందింది. పాశ్చాత్య ప్రపంచ దృష్టిలో నాలుగు శతాబ్దాల పాటు నిరంకుశ సోవియట్ దేశానికి ఒక శాటిలైట్‌గా దాని నీడలో ఉన్న బల్గేరియా తిరిగి తన ప్రాధాన్యతను పెంచుకోసాగింది. ఇందులో ఆశ్చర్యం లేదు. బల్గేరియా వాసులు తమ చరిత్రను, సంస్కృతిని సంరక్షించుకోవడంలో ఆసక్తిని కనబరుస్తారు. అందుకే ఎన్ని వ్యతిరేకతలున్నా, అసమానతలున్నా వారి సంస్కృతి ఏ మాత్రం చెదరకుండా ఉండగలిగింది. ఇది 19వ శతాబ్దంలో స్వాతంత్య్రం పొందే వరకు దీర్ఘకాలంగా బైజాంటైన్ సంస్కృతితో ప్రభావితమైన 500 సంవత్సరాలు ఒట్టోమాన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. 20 శతాబ్దపు చివరి సంవత్సరంలో పురోగతి సాధించడం మొదలుపెట్టి ఉ్ఖ లో కొత్త సభ్యురాలిగా చేరింది.  నాటోలో కూడా ఒక సభ్యదేశంగా ఉంది. బల్గేరియా రాజధాని సోఫియా. 2,400 సంవత్సరాల చరిత్రగల అతి పెద్ద నగరం. ఈ నగరం దేశంలోని పశ్చిమ భాగంలో విటొషా పర్వత పాదాల వద్ద, బాల్కన్ ద్వీపకల్పం మధ్యలో ఆక్రమించి ఉంది.
 
సోఫియా

బల్గేరియా రాజధాని అయిన సోఫియా యూరోపియన్ యూనియన్‌లో 15వ అతిపెద్ద నగరం. దాదాపు 1.3 మిలియన్ జనాభా ఉంది. ఇది  గ్లోబలైజేషన్, వరల్డ్ సిటీస్ రీసెర్చ్ నెట్‌వర్క్ ద్వారా బీటీ నగరంగా గుర్తించబడింది. ఎన్నో ప్రధాన విశ్వవిద్యాలయాలు, సాంస్కృతిక సంస్థలు, వ్యాపారా కేంద్రాలు సోఫియా నగరంలో ఉన్నాయి.
 
 జుమాయ మసీదు

ఈ మసీదు గోడలు మందపాటి రాళ్ళతో నిర్మించబడి, బలమైన గోపురాలతో కట్టబడి నిర్ణించబడి ఉంది. అంతర్గత నిర్మాణాన్ని ఒక స్మారకంగా నిర్మించారు. తొమ్మిది భారీ అంతర్గత సొరంగాలు నాలుగు చదరపు స్తంభాలతో సహాయంతో ఏర్పడ్డాయి. దీని గోడలు వివిధ రంగులతో ఆభరణాలు బొమ్మలు, ఖురాన్‌కి సంబంధించిన సూక్తులతో అలంకరించారు. 19 శతాబ్దపు కుడ్యచిత్రాలను ముస్తాఫా ఝెలెబి మసీదుపై గీశారు.
 
 ప్లిస్కా


ప్లిస్కా 681-893 నుండి మొదటి బల్గేరియా సామ్రాజ్యపు రాజధానిగా ఉండేది. ప్లిస్కా మొదటి నిర్మాణం 7 శతాబ్దపు చివరి కాలంలో నిర్మించారు. వాటిని చెక్కతో వృత్తాకారంగా, దీర్ఘచతురస్రాకారంగా చేశారు. కొన్ని నివాసాలుగా మరికొన్ని ఇతర వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించారు. 8వ శతాబ్దపు చివర 9వ శతాబ్దపు మొదట్లో చెక్కతో నిర్మించిన కట్టడాల స్థానంలో రాతితో కట్టడాలను ఏర్పాటు చేశారు. హన్‌క్రమ్‌ని మొట్ట మొదటి రాతి నిర్మాణంగా చెప్పుకుంటారు.
 
 కజాన్లాక్ పట్టణం


 కజాన్లాక్ పట్టణం బల్గేరియా మధ్యలో ఉంది. దీని జనాభా సుమారు 82,000. కజాన్లాక్ రోజెస్ లోయ, థ్రేసియన్ రాజుల భవనంతో ఒక పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉంది. దేశంలోనే అతిపెద్ద థ్రేసియన్ సమాధులు ఇక్కడ కనిపిస్తాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement