వారణాసి: ఆశ అనేని మనిషిని ముందుకు నడిపిస్తుందని అంటారు. మహారాష్ట్రకు చెందిన ఒక జంట 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుని కోసం ఏళ్ల తరబడి ఆశగా అన్నిచోట్లా వెదుకుతోంది.
వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని జల్గావ్‌కు చెందిన విక్రమ్ మేఘ్వానీ 12 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ విక్రమ్ తల్లిదండ్రులు నాడు తప్పిపోయిన కొడుకు కోసం కాశీలోని దేవాలయాలలో వెదుకులాట సాగిస్తున్నారు. నవరాత్రులలో అమ్మవారు తప్పకుండా తమ వినతి వింటుందని, అందుకే కాశీలోని అమ్మవారి ఆలయాలలో తిరుగున్నామని వారు చెబుతున్నారు.
తప్పిపోయిన కొడుకు ఫోటోను పట్టుకుని తిరుగుతున్న రణోమల్ సమనోమల్ మేఘ్వానీ, ఆయన భార్య లక్ష్మీబాయి రణోమల్ మేఘ్వానీలను చూసిన వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వృద్ధ దంపతులు కాశీలోని వివిధ ఆలయాల వెలుపల తమ కుమారుని ఫొటోను, వివరాలతో కూడిన పోస్టర్‌ను అతికిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుని ఆచూకీ లభిస్తుందని విక్రమ్ తల్లి లక్ష్మీబాయి ఆశాభావం వ్యక్తం చేశారు.
2012, ఆగస్టు 29న తన కుమారుడు దుకాణం నుంచి ఇంటికి వస్తూ అదృశ్యమయ్యాడని లక్ష్మీబాయి తెలిపారు. దీనిపై మహారాష్ట్ర పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఇప్పటి వరకు తమ కుమారుని ఆచూకీ లభించలేదన్నారు. ఈ వృద్ధ దంపతులు నవరాత్రులలో కాశీలో ఉంటూ, తప్పిపోయిన తమ కుమారుని కోసం వెదుకుతున్నారు.
ఇది కూడా చదవండి: 16 ఏళ్లుగా మహిళ బందీ.. ఎముకల గూడు చూసి పోలీసులు షాక్
Comments
Please login to add a commentAdd a comment