వారణాసి: ఈ ఏడాది దీపావళి తిధిపై ఉన్న సందేహాలను తొలగిస్తూ, కాశీ విద్వత్ కర్మకాండ పరిషత్‌కు చెందిన పండితులు స్పష్టతనిచ్చారు. పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య అశోక్ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ దీపావళి తేదీపై వివిధ పంచాంగాలు గందరగోళం సృష్టించాయని, పలువురు రెండు తేదీలు సూచిస్తున్నారని అన్నారు. కాశీ పండితులు దీపావళి తేదీపై స్పష్టతనిచ్చారని అన్నారు.
అక్టోబరు 31న దేశవ్యాప్తంగా దీపావళి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అమావాస్య తిథి అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:52 గంటలకు ప్రారంభమవుతుంది. నవంబర్ ఒకటిన సాయంత్రం 5:13 వరకు ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీన రాత్రి అమావాస్య ఉంటుంది.
ధర్మసింధు, నిర్మాణ సింధుల ప్రకారం రాత్రి అమావాస్య ఉన్నరోజున అంటే అక్టోబర్ 31 రాత్రి లక్ష్మీపూజ, కాళీపూజలు చేసుకోవాలి. అలాగే దీపోత్సవాన్ని నిర్వహించుకోవాలి. అక్టోబరు 29న ధన్‌తేరస్, నరక చతుర్దశిని అక్టోబర్ 30 న చేసుకోవాలని అశోక్ ద్వివేది తెలిపారు. కాశీకి చెందిన అన్ని పంచాంగాల ప్రకారం దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న దీపావళి వేడుకలు చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: ఫీల్ గుడ్.. స్ట్రీట్ ఫుడ్!
Comments
Please login to add a commentAdd a comment