ago
-
12 ఏళ్లయినా వీడని ఆశ.. నవరాత్రుల్లో కొడుకు దొరుకుతాడని..
వారణాసి: ఆశ అనేని మనిషిని ముందుకు నడిపిస్తుందని అంటారు. మహారాష్ట్రకు చెందిన ఒక జంట 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుని కోసం ఏళ్ల తరబడి ఆశగా అన్నిచోట్లా వెదుకుతోంది.వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన విక్రమ్ మేఘ్వానీ 12 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ విక్రమ్ తల్లిదండ్రులు నాడు తప్పిపోయిన కొడుకు కోసం కాశీలోని దేవాలయాలలో వెదుకులాట సాగిస్తున్నారు. నవరాత్రులలో అమ్మవారు తప్పకుండా తమ వినతి వింటుందని, అందుకే కాశీలోని అమ్మవారి ఆలయాలలో తిరుగున్నామని వారు చెబుతున్నారు.తప్పిపోయిన కొడుకు ఫోటోను పట్టుకుని తిరుగుతున్న రణోమల్ సమనోమల్ మేఘ్వానీ, ఆయన భార్య లక్ష్మీబాయి రణోమల్ మేఘ్వానీలను చూసిన వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వృద్ధ దంపతులు కాశీలోని వివిధ ఆలయాల వెలుపల తమ కుమారుని ఫొటోను, వివరాలతో కూడిన పోస్టర్ను అతికిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుని ఆచూకీ లభిస్తుందని విక్రమ్ తల్లి లక్ష్మీబాయి ఆశాభావం వ్యక్తం చేశారు.2012, ఆగస్టు 29న తన కుమారుడు దుకాణం నుంచి ఇంటికి వస్తూ అదృశ్యమయ్యాడని లక్ష్మీబాయి తెలిపారు. దీనిపై మహారాష్ట్ర పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఇప్పటి వరకు తమ కుమారుని ఆచూకీ లభించలేదన్నారు. ఈ వృద్ధ దంపతులు నవరాత్రులలో కాశీలో ఉంటూ, తప్పిపోయిన తమ కుమారుని కోసం వెదుకుతున్నారు.ఇది కూడా చదవండి: 16 ఏళ్లుగా మహిళ బందీ.. ఎముకల గూడు చూసి పోలీసులు షాక్ -
లక్షల ఏళ్ళ క్రితమే అక్కడ మనుషులున్నారు..
బెంగళూరుః దేశంలోనే సాఫ్ట్ వేర్ కార్యకలాపాలకు కేంద్రంగా... సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు నగరం ఇప్పుడు ప్రాచీన చరిత్రకూ సాక్ష్యంగా మారింది. చరిత్రకారుడు డాక్టర్ కె.బి. శివతారక్ మొదటిసారి బెంగళూరులో జరిపిన పరిశోధనల్లో రాతియుగంనాటి ఆనవాళ్ళు కనిపించాయి. నాలుగు లక్షల ఏళ్ళ క్రితమే అక్కడ మనుషుల ఉనికి ఉన్నట్లు ఆయన తన పరిశోధనల ద్వారా నిరూపించారు. బెంగళూరులో మొట్టమొదటిసారి రాతియుగంనాటి చరిత్రకు ఆనవాళ్ళు బయటపడ్డాయి. బెంగళూరు ప్రాంతంలో 4 లక్షల ఏళ్ళ క్రితమే మనుషుల మనుగడ ఉన్నట్లు మంగళూరు విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర, పురాతత్వ శాస్త్రాల రిటైర్డ్ ప్రొఫెసర్ కె.బి. శివతారక్ వెల్లడించారు. తవ్వకాల్లో ఇంతకు ముందెప్పుడూ బయట పడని లక్షల ఏళ్ళనాటి చారిత్రక సాక్ష్యాలు వెలువడినట్లు ఆయన చెప్తున్నారు. కదిరెనహల్లి ప్రాంతంలో నీటి పైపుల లీకేజ్ ను పరిశీలించేందుకు మే నెలలో చేపట్టిన తవ్వకాల సమయంలో తానక్కడే ఉన్నానని, సమీపంలోనే నివసిస్తుండటంతో అక్కడి తవ్వకాలను ఎంతో ఉత్సుకతతో గమనించానని, అక్కడ బయటపడ్డ రాళ్ళను తీసి పరిశీలించడంతో, గతంలో తాను తుముకూరు, మాండ్యా, చిత్రదుర్గ జిల్లాల నుంచి సేకరించిన ప్రాచీన పనిముట్లకు సంబంధించిన పోలికలు ఉన్నట్లు గమనించానని శివతారక్ తెలిపారు. చేతి గొడ్డలి, ఆకురాయి, సుత్తి, స్ఫటిక శిల వంటి ఐదు రాతి పనిముట్లను వనశంకరి ప్రాంతంనుంచీ తాను సేకరించినట్లు శివతారక్ తెలిపారు. రాతియుగంనాటి మనుషులు ఈ పనిముట్లను వివిధ అవసరాలకు వినియోగించినట్లు తెలుస్తోందని చెప్పారు. అప్పట్లో వేట ప్రధాన వృత్తిగా ఉండటంతో జంతువులను చంపేందుకు, వాటి చర్మం ఒలిచేందుకు, ఇతర పనులకు రాతి పనిముట్లను వినియోగించి ఉండొచ్చని ఆయన వివరించారు. తనకు దొరకిన పరికరాలను ఆయన పురాతత్వ కార్యాలయానికి సమర్పించారు. అయితే రాతియుగంనాటి మనుషులు బెంగళూరు పరిసరాల్లో నివసించినట్లు ఇంతకు ముందు ఎటువంటి ఆధారాలు లేవని, అలాగే స్ఫటిక క్వారీలు, పనిముట్ల వినియోగం కూడా కనిపించలేదని, తుమకూరు ప్రాంతంలో ఈ స్ఫటిక, రాతి పనిముట్లు ఎలా బయటపడ్డాయో అంతుచిక్కడం లేదని కర్ణాటక విశ్వవిద్యాలయానికి చెందిన మరో పురాతత్వ మాజీ ప్రొఫెసర్ రవి తెలిపారు. -
లక్షల రూపాయలతో బ్యాగ్ లు కొనేసింది!
నాలుగేళ్ళ క్రితం ఆమెను నడమంత్రపు సిరి వరించింది. ఓ బ్యాంక్ అనుకోకుండా చేసిన తప్పిదం ఆమెను ధనవంతురాల్ని చేసింది. అప్పనంగా వచ్చిన సుమారు ఏభై లక్షల రూపాయలను ఆమె.. మూడో కంటికి తెలియకుండా ఖర్చు చేసేందుకు చూసింది. అయితే ఆ అదృష్టం కేవలం నాలుగేళ్ళే నిలిచింది. ఆరా తీసిన బ్యాంక్ సిబ్బందికి అసలు విషయం తెలియడంతో ప్రయాణానికి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమెను వలవేసి పట్టుకున్నారు. మిలియనీర్ గా మారిన 21 ఏళ్ళ క్రిస్టీన్ జియాక్సిన్ లీ.. తనకు కలసి వచ్చిన అదృష్టాన్నినాలుగేళ్ళపాటు రహస్యంగానే ఉంచింది. బ్యాంక్ సిబ్బంది చేసిన తప్పుతో ఆమె అకౌంట్ లోకి వచ్చిన సుమారు 46 లక్షల రూపాయలను ఖరీదైన డిజైనర్ వస్తువులు, హ్యాండ్ బ్యాగ్ ల కొనుగోలుకు ఖర్చు చేసేసింది. అయితే నాలుగేళ్ళ తర్వాత ఆమె ఓ ఎమర్జెన్సీ పాస్ పోర్టుతో మలేషియా వెళ్ళేందుకు సిడ్నీ ఎయిర్ పోర్టుకు చేరగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంకా తన బ్యాంకులో 33 లక్షల రూపాయల వరకూ బ్యాలెన్స్ ఉందని, మిగిలిన డబ్బును తనకిష్టమైన ఖరీదైన వస్తువులు కొనుక్కున్నానని, కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని జియాక్సిన్ పోలీసులకు తెలిపింది. డబ్బు వచ్చిందని తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, ఆమె స్వంత ఖర్చులకు వినియోగించడాన్ని కోర్టు నేర చర్యగా పరిగణించింది. సిడ్నీ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న జియాక్సిన్ ను అరెస్టు చేసిన పోలీసులు 2014 జూలై నుంచి, 2015 ఏప్రిల్ మధ్య కాలంలో ఆమె అనేక దఫాలుగా ఏటీఎం నుంచి డబ్బును డ్రా చేసినట్లు చెప్తున్నారు. అయితే కనీసం తనకు వచ్చిన డబ్బు ఏ బ్యాంకు నుంచి వచ్చిందన్న విషయాన్నికూడ తెలుసుకునేందుకు ఆమె ప్రయత్నించలేదని ఆరోపించారు. అయితే జియాక్సిన్ కు బెయిల్ ఇచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం... బ్యాంకు చేసిన పొరపాటు గురించి తనకు ఎటువంటి అవగాహనా లేదని, అయితే ఆమె ఖర్చు చేసినట్లు ఆరోపణలు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించాడు.