జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేసి నేటికి (ఆగస్టు 5) ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు భద్రతను మరింతగా పెంచారు. భద్రతా దళాలు అణువణువునా పహారా కాస్తున్నాయి.
2019 ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. దీనికితోడు జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తయిన నేపధ్యంలో జమ్మూ జిల్లాలోని అఖ్నూర్‌లో భద్రతను మరింతగా పెంచారు. ఈ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై నిఘా సారిస్తున్నారు.
ఈ సందర్భంగా దక్షిణ జమ్మూ ఎస్పీ అజయ్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల దృష్ట్యా తాము మరింత అప్రమత్తంగా ఉన్నామన్నారు. కాగా దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత జమ్ముకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులు జరిగాయి. వీటిలో కథువాలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి, దోడా, ఉదంపూర్‌లలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ ప్రధానమైనవి.
Comments
Please login to add a commentAdd a comment