2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌.. ? | World Cup 2023 Final Predictions By Popular Cricketers | Sakshi
Sakshi News home page

2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌.. ?

Published Sun, Oct 1 2023 4:26 PM | Last Updated on Sun, Oct 1 2023 9:17 PM

World Cup 2023 Final Predictions By Popular Cricketers - Sakshi

వరల్డ్‌కప్‌ 2023 ప్రారంభానికి కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో విశ్వవ్యాప్తంగా క్రికెట్‌ ఫీవర్‌ మొదలైంది. ఎక్కడ చూసినా జనాలు ఈ మెగా ఈవెంట్‌ గురించే చర్చించుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు వరల్డ్‌కప్‌ విజేతపై ప్రిడిక్షన్స్‌ ఇస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా దీనిపై క్విజ్‌ పోటీలు నడుస్తున్నాయి. వరల్డ్‌కప్‌ విజేతలు ఎవరో కరెక్ట్‌గా అంచనా వేసిన వారికి పలు సంస్థలు ప్రైజ్‌మనీ కూడా ప్రకటించాయి.

ఈ అంశంపై పాపులర్‌ క్రికెటర్లు సైతం తమ అభిప్రాయాలను షేర్‌ చేసుకుంటున్నారు. తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పలు మాజీ స్టార్లు ఫైనల్‌కు చేరే జట్లపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎవరెవరు ఏయే జట్లు ఫైనల్‌కు చేరుతాయని చెప్పారంటే..

  • జాక్‌ కల్లిస్‌: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌
  • క్రిస్‌ గేల్‌: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌
  • షేన్‌ వాట్సన్‌: ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా
  • దినేశ్‌ కార్తీక్‌: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌
  • ఫాఫ్‌ డెప్లెసిస్‌: ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్‌
  • వకార్‌ యూనిస్‌: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌
  • డేల్‌ స్టెయిన్‌: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌
  • ఇర్ఫాన్‌ పఠాన్‌: ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా
  • ముత్తయ్య మురళీథరన్‌: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌
  • సంజయ్‌ మంజ్రేకర్‌: ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా
  • పియూశ్‌ చావ్లా: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌
  • ఆరోన్‌ ఫించ్‌: ఆస్ట్రేలియా వర్సెస్‌ సౌతాఫ్రికా

అందరు స్టార్‌ క్రికెటర్లు ఈ సారి టీమిండియా వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరడం​ ఖాయమని అభిప్రాయపడ్డారు. అయితే ప్రత్యర్ధుల విషయంలో మాత్రం ఒక్కొక్కరి అభిప్రాయం​ ఒక్కోలా ఉంది. మెజార్టీ శాతం ఇండియా, ఇంగ్లండ్‌లు ఫైనల్‌కు చేరతాయని అంచనా వేశారు. కొంతమంది భారత్‌, పాక్‌ మధ్య ఫైనల్‌ జరుగుతుందని అన్నారు. మరి రానున్నవరల్డ్‌కప్‌లో ఏ జట్లు ఫైనల్‌కు చేరతాయో మీ అభిప్రాయం కూడా చెప్పండి. 

ఇదిలా ఉంటే, 2023 ప్రపంచకప్‌ భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌- గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌ స్టార్ట్‌ అవుతుంది. వరల్డ్‌కప్‌ కోసం ఇప్పటికే అన్ని జట్లు భారత్‌కు చేరుకున్నాయి.

ప్రస్తుతం అన్ని జట్లు వార్మప్‌ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాయి. అక్టోబర్‌ 8న జరిగే మ్యాచ్‌తో ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌, ఆస్ట్రేలియా జర్నీ స్టార్ట్‌ అవుతుంది. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు చెన్నై వేదిక కానుంది. ఈనెల 14న టీమిండియా పాకిస్తాన్‌తో తలపడుతుంది. అహ్మదాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement